Home / israel iran war
Israel On Iran War: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మిస్సైల్స్‌తో దాడులు చేస్తోందంటూ ఇజ్రాయెల్ ఆరోపించడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో చివరికి సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 82 వేల 55 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 72 పాయింట్ల […]
Iran – Israel War Update: ఇరాన్ నుంచి అణు ముప్పును తాము ఒక వ్యూహం ప్రకారం అణచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు తెలిపాయి. ఇప్పటికే తమ ఎయిర్‌ఫోర్స్ ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ వెల్లడించారు. తాము ఒక పద్ధతి ప్రకారం ఇరాన్‌లోని అణుముప్పును నాశనం చేస్తున్నామని తెలిపాయి. తమ దాడులు వారి నష్టాన్ని గణనీయంగా పెంచుతున్నాయని, ఫలితంగా వారి బాలిస్టిక్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ […]
Israel-Iran War Updates: ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఐదోరోజూ కొనసాగుతోంది. టెహ్రాన్‌పై టెల్అవీవ్ చేసిన దాడుల్లో ఇరాన్ సీనియర్-మోస్ట్ మిలిటరీ అధికారి, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహిత సైనిక సలహాదారు అలీ షాద్మానీ దుర్మరణం చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. అలీ షాద్మానీ సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ ప్రదేశంలో తలదాచుకున్నట్లు తమకు వచ్చిన సమాచారంతో దాడులు జరిపినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేస్తున్న పలు క్షిపణి దాడులకు అలీ నేతృత్వం వహించారని తెలిపింది. […]
Daily Needs Price will increase due to Iran – Israel War: పశ్చిమాసియా పరిణామాల ప్రభావం అనేక దేశాలపై తీవ్రంగా పడనుంది. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. ప్రధానంగా చమురు ధరలు భారీగా పెరగవచ్చు. అంతేకాదు ఆయా దేశాలకు చమురు సరఫరా లో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల జీవన వ్యయం కూడా పెరిగే అవకాశాలున్నాయి. పశ్చిమాసియా ప్రస్తుతం రణరంగాన్ని గుర్తుకు తెస్తోంది. ఎటు చూసినా దాడులు,ప్రతి […]