Home / business news
దేశీయ ఈ కామర్స్ రంగంలో ప్రముఖ కంపెనీ రిలయన్స్ దూసుకుపోతోంది. సుమారు రూ. 12.30 లక్షల కోట్ల దేశీయ ఈ కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థలు అమెజాన్, వాల్ మార్ట్ కంటే రిలయన్స్ ముందుందని పేర్కొంది.
భారత మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల రవాణా బాగా పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పీసీల రవాణా 29.92 లక్షల యూనిట్లకే పరిమితమైంది. ఇది గత ఏడాది తో పోలిస్తే 30 శాతం తక్కువగా నమోదు అయింది.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్‌లో స్టోరీస్ ఫీచర్ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
జై కోటక్, అదితి ఆర్య నిశ్చితార్థం పై చాలా రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫొటోలు బయటకు కూడా వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ అధికారంగా చెప్పలేదు.
ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియోకు చెందని బ్రాడ్ బ్యాండ్ విభాగం జియో ఫైబర్ తాజాగా యూజర్ల కోసం మరో ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. మూడు నెలల కోసం తీసుకొచ్చిన ఈ ప్లాన్ ఇంటర్నెట్ కోరుకునే వారికి బాగా ఉపయోగపడనుంది.
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లకు సమయం గడుస్తున్న కొద్దీ కొనుగోళ్ల అండ లభించింది. రిలయన్స్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి దిగ్గజ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల కళ స్పష్టంగా కనిపించింది.
‘నథింగ్’ నుంచి గత ఏడాది అట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లతో తొలి స్మార్ట్ ఫోన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
ప్రైవేటు రంగుల్లో ఉద్యోగులకు సంబంధించి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ప్రైవేటు ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు రూ. 3 లక్షలుగా ఉంది. ఈ పరిమితిని 2002 లో నిర్ణయించారు.
ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్వీఎంహెచ్ కంపెనీ లగ్జరీ ప్రొడక్టులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ వివిధ బ్రాండ్లతో కాస్ట్ లీ హ్యాండ్‌బ్యాగ్స్, షాంపులు, ఖరీదైన గౌన్లతో సహా మరెన్నో వస్తువులను తయారు చేస్తుంది.
ట్విటర్ ను కొన్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ అందులో చాలా మార్పులు చేపట్టారు. ఈ క్రమంలో పోటీ యాప్‌లకు విభిన్నంగా ఉండటం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు.