Home / Britain
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. ఈ క్రమంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కోవిడ్‌లో ఒమిక్రాన్ బీఏ.4.6 అనే కొత్త వేరియంట్ అమెరికా, బ్రిటన్లతో సహా పలు దేశాల్లో విస్తరిస్తోంది.
బ్రిటన్ రాణి క్వీన్ఎలిజబెత్- 2 అంత్యక్రియలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పంపగా, దాదాపు 500 మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.
కింగ్ చార్లెస్ III బ్రిటీష్ కిరీటాన్ని అలంకరించినప్పటి నుండి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ప్రజలు అతని గురించి ప్రతిదీ తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉన్నారు. అతను తన అల్పాహారంలో తినడానికి ఇష్టపడేవాటి నుండి రాజు తన ఖాళీ సమయంలో చేసే పనుల వరకు ఇందులో ఉన్నాయి.
బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణంతో ఆ దేశ ప్రజల్లో కొత్త అనుమానం పుట్టుకొచ్చింది. తమ పాస్‌పోర్టులు అంతర్జాతీయంగా చెల్లుబాటు అవుతాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే.. యూకే పాస్‌పోర్టుల మొదటి పేజీపై ‘‘శ్రీమత్ మహారాణికి చెందిన విదేశాంగ మంత్రిగా ఇందుమూలముగా సంబంధిత వ్యక్తులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా.. ఎవరైతే దీన్ని (పాస్‌పోర్టు) కలిగి ఉన్నారో ఆ వ్యక్తి ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా... ఆ వ్యక్తికి అవసరమైన మేర సాయాన్ని, భద్రతను కల్పించాలి’’అని రాసి ఉంటుంది.
కింగ్ చార్లెస్ III అధికారికంగా బ్రిటన్ తదుపరి పాలకుడిగా శనివారం పట్టాభిషిక్తుడయ్యారు. వెంటనే అక్కడఉన్నవారందూ గాడ్ సేవ్ ది కింగ్!" అంటూ నినాదాలు చేసారు. ఈ వేడుకును మొదటిసారిగా టెలివిజన్ లో ప్రసారం చేసారు.
బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి క్వీన్ ఎలిజబెత్ స్కాట్లాండ్లోని ఆమె బాల్మోరల్ కాజిల్‌లో మరణించారు. 1,116 కోట్ల విలువైన ఈ విశాలమైన కోటకు దివంగత రాణి యజమాని. బ్రిటన్ రాజకుటుంబం ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటిగా ఉంది.
96 సంవత్సరాల వయస్సులో మరణించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II వద్ద 105 క్యారెట్ల వజ్రం 'కోహినూర్'తో సహా అనేక విలువైన రత్నాలు మరియు ఆభరణాలనుఉన్నట్లు తెలిసింది. అందులో ఒకటి దాదాపు 300 వజ్రాలు పొదిగిన ఐకానిక్ ప్లాటినం నెక్లెస్ సెట్.
యునైటెడ్ కింగ్డమ్ జాతీయ జీవితంలో రాచరికం విడదీయరాని భాగం. మరియు చక్రవర్తి యొక్క చిత్రం, చిహ్నాలు మరియు రాచరిక కోడ్ ప్రజల రోజువారీ జీవితాలతో సంక్లిష్టంగా ముడిపడి ఉన్నాయి.
క్వీన్ ఎలిజబెత్ II యొక్క మరణానంతర ప్రణాళికకు లండన్ బ్రిడ్జ్ అనే సంకేతనామం పెట్టబడింది. కానీ చక్రవర్తి స్కాట్లాండ్లో ఉన్నప్పుడు చనిపోతే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. దీనిని ఆపరేషన్ యునికార్న్ అని పిలుస్తారు.
సూర్యుడస్తమించని రాజ్యంలో గాడాంధకారం నెలకొనింది. గ్రేట్ బ్రిటన్ రాణి అయిన ఎలిజబెత్-2 ఇక మన మధ్య లేరు. అనారోగ్య సమస్యల దృష్ట్యా గురువారం రాత్రి ఆమె స్కాట్లాండ్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.