Home / AP
AP: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. యూఏఈ, థాయిలాండ్ లో ఉన్న ఎనిమిది మంది నిందితులను సిట్ అధికారులు గుర్తించారు. నిందితులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, బొల్లారం శివకుమార్, ముప్పడి అనిరుధ్ రెడ్డి, సైమన్ ప్రసన్, చంద్రపతి ప్రద్యుమ్న, పురుషోత్తం వరుణ్ కుమార్, ముప్పిడి అవినాష్ రెడ్డిని ఎక్స్ ట్రాడిషన్, డిపోర్టేషన్ ద్వారా ఇండియాకు తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అవసరమైన […]
CM Chandrababu: వైఎస్ సునీత మరోసారి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తన తండ్రి వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాది సెప్టెంబర్ లో కూడా సునీత తన భర్త రాజశేఖర్ రెడ్డితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సచివాలయంలో చంద్రబాబుతో పదినిమిషాల పాటు సునీత దంపతులు వివేక హత్య గురించి మాట్లాడారు. కాగా వివేకా హత్యపై విచారణ జరిపిస్తామని అప్పుడు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజాగా మరోసారి […]
Heavy Rains for another Five Days to Andhra Pradesh: ఏపీలో వర్షాపాతం మెరుగుపడుతుంది. ఉపరితల ద్రోణి, నైరుతి రుతుపవనాల కదలికతో గత నాలుగు, ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు 14 జిల్లాల్లో వర్షపాతం సాధారణ స్థితికి వచ్చింది. అలాగే మరో 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొందని వాతావరణ నిపుణులు తెలిపారు. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, తూర్పగోదావరి, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షపాతం […]
Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ ఇవాళ సమీక్ష నిర్వహించారు. నగర నిర్మాణంలో భాగంగా ఇప్పటికే అనేక నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలతో పాటు అధికారుల నివాసాల నిర్మాణంపై స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా రాజధాని ప్రాజెక్టులో కీలకమైన ట్రంక్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. మొత్తం 360 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రుల బంగ్లాలను […]
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను రాజమండ్రి జైలుకి తరలించనున్నారు. అంతకు ముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి […]
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కోర్టులో 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్ట్ రిపోర్టును సిట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. మనీ ట్రయల్ తో పాటు కుట్రదారుడుగా మిథున్ రెడ్డిని పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిసి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి […]
Godavari River: వర్షాకాలం వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో పులస చేపల హంగామా మాములుగా ఉండదు. అరుదుగా దొరికే పులసలను దక్కించుకునేందుకు మాంసం ప్రియులు పోటీ పడతారు. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అనే సామెత తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. తాజాగా గోదావరిలో పడిన ఓ పులస చేప.. యానాం మార్కెట్ వేలం పాటలో రూ. 12 వేలకు అమ్ముడైంది. పులస అంటే పులకింతే.. కానీ ఇప్పుడు అది దొరకడం అంత ఈజీ కాదు. జులై […]
TDP: టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పార్టీకి రాజీనామా చేశారు. గోవా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజకీయ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా కేంద్రం నియమించింది. ఈ మేరకు త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు తనకు అనేక అవకాశాలు కల్పించిన టీడీపీకి […]
Polavaram Project: బాధ్యతారహితమైన ప్రతిపక్షం ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ సహా అన్నింటిపైన వైఎస్ జగన్ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. పోలవరంపై అబద్ధాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు. డయా ఫ్రా వాల్ ను ధ్వంసం చేసి పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ గందరగోళం సృష్టించడం కోసం ప్రణాళిక బద్ధంగా ప్రయత్నం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యత కలిగిన […]
Telangana and AP Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. నిన్నటి వరకు ఎండ, ఉబ్బలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఒక్కసారిగా ఊరట లభించింది. వర్షాకాలంలో వాతావరణ అనిశ్చితితో తీవ్ర ఎండలతో ప్రజలు అల్లాడిపోయారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఉపశమనం లభించింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ […]