Home / AP
Gudivada: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఇవాళ గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ముందస్తు బెయిల్ లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన సంతకాలు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నానికి గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కొడాలి నాని ఇవాళ పీఎస్ […]
Markapuram As New District: రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతోంది. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందుకు తగ్గట్టుగానే మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కట్టుబడి ఉంది అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రకాశం జిల్లాలో రూ. 165 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించామని చెప్పారు. […]
Heavy Flood: ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ కు వరద పెరుగుతోంది. ప్రాజెక్ట్ కు సుమారు 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 10 గేట్లను ఎత్తి 66,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,635 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్-1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ద్వారా 315 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 550 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్ కు 150, బీమా […]
Kurnool District: కర్నూలు జిల్లాలో వజ్రాల వేట జోరుగా సాగుతోంది. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో పెద్దసంఖ్యలో ప్రజలు, రైతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల కోసం పోలాల వైపు వెళ్తున్నారు. స్థానికులే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా వజ్రాల వేటకు వస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి వజ్రాలు దొరికాయి. తుగ్గలి మండలంలో మదనంతపురం, జొన్నగిరిలో విలువైన వజ్రాలు లభించగా.. తాజాగా పెండకల్ గ్రామంలో ఓ వ్యవసాయ కూలికి విలువైన వజ్రం లభించింది. తుగ్గలి […]
AP and Telangana High Courts: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరికొందరు కొత్త జడ్జీలు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలను నియమించాలని నిర్ణయించింది. ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీల నియామకానికి కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు జడ్జీలుగా జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ గౌస్ […]
Flood In Krishna River: ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి కృష్ణా నదిలో కలుస్తున్నాయి. దీంతో కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్ట్ లకు భారీగా వరద వస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. కొత్తనీటితో ప్రాజెక్ట్ నీటిమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జులై మొదటి వారంలోనే ప్రాజెక్టులకు నీరు రావడంతో పంటలకు నీటి […]
Tirupati Govindaraja Swamy Temple: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. సన్నిధి వీధిలోని ఓ షాపులో మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగి రెండు షాపులు దగ్ధం అయ్యాయి. ఆ మంటలు కాస్త ఆలయం ముందు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకు అంటుకుని కొంతమేర కాలిపోయాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో గోవిందరాజస్వామి ఆలయం వెలుపల పందిళ్లు కొంతమేర కాలిపోయాయి. మరోవైపు […]
Private Schools bandh In AP: రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లు బంద్ చేస్తున్నట్టు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ పిలుపునిచ్చింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఆవేదన అందరికీ తెలిసేలా కార్యక్రమానికి అందరి సహకారంతో కార్పొరేట్ స్కూళ్లు సిద్ధం కావాలని కోరారు. కొందరు అధికారులు తనిఖీలు, నోటీసుల పేరుతో వేధిస్తున్నారని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆరోపించాయి. రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా 55 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులకు సేవలందిస్తున్నట్టు పేర్కొంది. అందుకే రేపు […]
Rain Alert To Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే రానున్న ఐదు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరపులు, ఈదురు గాలులతో వానలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీలోని అన్ని జిల్లాల్లో వచ్చే ఐదురోజులు […]
CM Chandrababu Tour In Kuppam: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న సీఎంకు జిల్లా, నియోజకవర్గ నేతలు, కలెక్టర్, ఎస్పీ, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శాంతిపురం మండలం తుంశి వద్ద ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్ట్ లో భాగంగా మొత్తం రూ. 1292. 74 […]