Home / ap assembly
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం నామినేషన్ దాఖలుచేశారు. శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులవద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. ఈ పదవికి ప్రతిపక్షం పోటీ పడనందున కోలగట్ల ఏకగ్రీంగా ఎన్నిక కానున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగానే ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. అసెంబ్లీలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు శుక్రవారం నాడు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి సాయంత్రం వరకు డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఉంది. సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
ప్రజా స్రవంతిలో ధరలు కట్టడి అనేది ఏ ప్రభుత్వానికైనా ఎంతో ముఖ్యం. దానిపై పాలక ప్రతిపక్షాల మద్య నిత్యం మాటలు యుద్దం జరుగుతూనే ఉంటుంది. కాని నేడు ఆదిశగా ప్రభుత్వాల అడుగులు పడడం లేదు. కేవలం ప్రతిపక్షానికి మేము ఏం జవాబు చెప్పేది అన్న కోణంలో సాగుతున్నట్లుగా శాసనసభా సమావేశాల తీరు ఉందని ఏపి అసెంబ్లీ సమావేశాలు రుజువుచేస్తున్నాయి
అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టాలంటే వందేళ్లైన పూర్తికాదని, కేవలం కలలో మాత్రమే ఊహించుకోవచ్చని సీఎం జగన్మోహన్ రెడ్డి మరోమారు స్పష్టం చేసారు. అసెంబ్లీలో జగన్ పాలన వికేంద్రీకరణపై ప్రసంగించారు
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొనే అవకాశం ఉంది.
మంత్రి మేరుగ నాగార్జున టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి పై చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అందరూ ఊహించిన్నట్లుగానే ఏపి అసెంబ్లీ నుండి తెలుగుదేశం సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేంతవరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని అమరావతి రైతులు స్పష్టం చేశారు