Last Updated:

India vs South Africa: సఫారీ పై సమరానికి సిద్ధమంటున్న టీమిండియా

టీమిండియాను కలవరపెట్టే అంశం ఓకె ఒక్కటి ఉంది కేఎల్ రాహుల్ ఫామ్.కనిసమ ఈ మ్యాచ్ లో నైనా అతడు గాడిలో పడాలని మేనేజ్ మెంట్ కోరుకుంటుంది.మరోవైపు ఈ మ్యాచ్ నుంచి రాహుల్ ను తప్పించి రిషబ్ పంత్ ను ఆడించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది

India vs South Africa: సఫారీ పై సమరానికి సిద్ధమంటున్న టీమిండియా

IND vs SA: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12లో భాగంగా సౌతాఫ్రికాతో సమరపోరుకు సిద్ధమైనా టీమిండియా.పాకిస్థాన్,నెదర్లాండ్ పై గెలిచిన టీమిండియా ఇప్పుడే గట్టి పోటీనే ఎదురుకోవాలసి ఉంది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో చెక్ పెడితే టీమిండియాకు దాదాపు సెమీస్ కు వెళ్ళినట్లే.ఎందుకంటే తర్వాత టీమిండియా ఆడబోయేది బంగ్లా, జింబాబ్వే వంటి చిన్న టీమ్స్ తోనే.బంగ్లాదేశ్ పై విజయంతో మంచి జోరు మీదున్న సౌతాఫ్రికాను ఓడించాలంటే టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు బాగా రాణించాల్సిందే.ఈ మ్యాచ్ పెర్త్ వేదికగా సాయంత్రం 4.30 నుంచి ప్రారంభంకానుంది.

టీమిండియాను కలవరపెట్టే అంశం ఓకె ఒక్కటి ఉంది కేఎల్ రాహుల్ ఫామ్.కనిసమ ఈ మ్యాచ్ లో నైనా అతడు గాడిలో పడాలని మేనేజ్ మెంట్ కోరుకుంటుంది.మరోవైపు ఈ మ్యాచ్ నుంచి రాహుల్ ను తప్పించి రిషబ్ పంత్ ను ఆడించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.మరి పంత్ కు ఈ మ్యాచ్లో అవకాశమిస్తారా లేక రాహుల్ ను కొనసాగిస్తారా అనేది మ్యాచ్ జరిగే వరకు వేచి చూడాలిసిందే. నెదర్లాండ్స్ మ్యాచ్ ద్వారా కెప్టెన్ రోహిత్ తన ఫామ్ ను కొనసాగించారు.ఇక కింగ్ కోహ్లీ, సూర్య భీకరమైన ఫామ్లో ఉండటం భారత్ కు బాగా కలిసొచ్చే అంశం.అయితే వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ ను ఈ మ్యాచ్ లోనూ కొనసాగిస్తారా లేక పంత్ కోసం పక్కన పెడతారా అనేది ఇంకా వేచి చూడాలి. బౌలింగ్ విషయానికొస్తే అర్ష్‌దీప్‌, భువి, షమి నుంచి మంచి ప్రదర్శన కనిపిస్తుంది.ఈ మ్యాచ్ లోనూ సత్తా చాటాలని టీమిండియా బలంగా కోరుకుంటుంది. ఆల్‌రౌండర్లు హార్దిక్‌, అశ్విన్‌లను కొనసాగించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: