RBI Monetary Policy Meet: మళ్లీ వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్.. పెరగనున్న ఈఎంఐలు
అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్ బీఐ) రెపో రేటు ను పెంచింది. బ్యాంకులను ఆర్బీఐ అందించే స్పల్పకాలిక రుణాలపై విధించే రేటు పావు శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది.
RBI Monetary Policy Meet: అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్ బీఐ) రెపో రేటు ను పెంచింది.
బ్యాంకులను ఆర్బీఐ అందించే స్పల్పకాలిక రుణాలపై విధించే రేటు పావు శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది.
వరుసగా 6 వసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో రెపో రేటు 6.50 శాతానికి చేరింది.
ఈఎంఐలు మరింత పెరిగే అవకాశం (RBI Repo Rate)
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులు రెపో రేటు పెంపునకు కారణం అయ్యాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.
ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంలో భాగంగా సర్దుబాటు వైఖరిని తిరిగి కొనసాగించాలని భావించినట్టు ఆయన తెలిపారు.
రెపో రేటు పెంపుతో రుణగ్రహీతలపై భారం పడనుంది. ఆర్బీఐ విధించే వడ్డీ రేట్లను బ్యాంకులు రుణ తీసుకునే వారిపై విధిస్తాయి.
ఫలితంగా ఇప్పటికే ఖాతాదారులు చెల్లిస్తున్న ఈఎంఐలు మరింత పెరిగే అవకాశాలున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
జీడిపీ వృద్ది అంచనా
2023-2024 ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడిపీ వృద్ది 6.4 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు.
గతంలో మాదిరిగా గ్లోబల్ ఎకానమీ పరిస్థితి అంత బాగాలేదన్నారు. ఈ ఎంపీసీ భేటీలో ఆర్బీఐ మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.
కాగా , 2023 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనా 6.8 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది.
మార్పులు లేని రివర్స్ రెపో రేటు (RBI Repo Rate)
డిసెంబర్ లో జరిగిన సమీక్షలో రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. అంతకు ముందు 3 సమీక్షల్లో 50 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే.
ఈ సారి మాత్రం పావు శాతం పెంపు 25 బేసిస్ పాయింట్లకే పరిమితం చేశారు. రివర్స్ రెపో రేటు 3.35 శాతంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
గత ఏడాది మే నుంచిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ 225 బేసిస్ పాయింట్లు రెపో రేటు పెంచగా..
తాజగా పెంచిన 25 బేసిస్ పాయింట్లతో 250 బేసిస్ పాయింట్లతో 6.5 శాతానికి చేరింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/