INS Vikrant: ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించి, భారత నావికాదళం కోసం కొత్త నౌకాదళజెండాను ఆవిష్కరించారు. 20,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ఛత్రపతి శివాజీకి అంకితం చేసిన ప్రధాని,
INS Vikrant: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించి, భారత నావికాదళం కోసం కొత్త నౌకాదళజెండాను ఆవిష్కరించారు. 20,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ఛత్రపతి శివాజీకి అంకితం చేసిన ప్రధాని, భారతదేశం వలసవాద గతాన్ని పోగొట్టిందని అన్నారు. భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక సంస్థలు అలాగే 100కి పైగా ఎంఎస్ఎంఇలు అందించిన స్వదేశీ పరికరాలు మరియు యంత్రాలను ఉపయోగించి ఈ యుద్ధనౌకను నిర్మించారు.
ఈ సందర్బంగా పర్ధాని మోదీ మాట్లాడుతూ ఈ రోజు మనం మన స్వాతంత్ర్య సమరయోధుల కలల పటిష్టమైన భారతదేశం యొక్క చిత్రాన్ని చూస్తున్నాము. విక్రాంత్ కేవలం యుద్ధనౌక మాత్రమే కాదు, 21వ శతాబ్దంలో భారతదేశ కృషి, సామర్థ్యం, ప్రభావం మరియు నిబద్ధతకు నిదర్శనం. లక్ష్యాలు చిన్నవి అయితే, ప్రయాణాలు సుదీర్ఘమైనవి, మహాసముద్రాలు మరియు సవాళ్లు అంతులేనివి – విక్రాంత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క సాటిలేని అమృతం. భారతదేశం స్వయం సమృద్ధిగా మారడానికి ఇది ఒక ప్రత్యేక ప్రతిబింబం. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు.
గతంలో, ఇండో-పసిఫిక్ ప్రాంతం మరియు హిందూ మహాసముద్రంలో భద్రతాపరమైన ఆందోళనలు చాలాకాలంగా విస్మరించబడ్డాయి. కానీ, నేడు ఈ ప్రాంతం మనకు దేశంలో ప్రధాన రక్షణ ప్రాధాన్యత. అందుకే నేవీకి బడ్జెట్‌ను పెంచడం నుండి దాని సామర్థ్యాన్ని పెంచడం వరకు మేము ప్రతి దిశలో పని చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు.