Last Updated:

New Delhi : ఆస్తుల్లో జగన్.. కేసుల్లో కేసీఆర్ .. దేశంలో తెలుగు సీఎంలే టాప్

దేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్ లో నిలిచారు. ఎందులోనో తెలుసా? ఒకరు ఆస్తుల్లో.. మరొకరు కేసుల్లో.. ఏపీ సీఎం జగన్ రూ. 370 కోట్ల ఆస్తులతో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలవగా 64 కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ మరొకవైపు అగ్రస్దానంలో నిలిచారు.

New Delhi : ఆస్తుల్లో జగన్.. కేసుల్లో కేసీఆర్ .. దేశంలో తెలుగు సీఎంలే టాప్

New Delhi : దేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్ లో నిలిచారు. ఎందులోనో తెలుసా? ఒకరు ఆస్తుల్లో.. మరొకరు కేసుల్లో.. ఏపీ సీఎం జగన్ రూ. 370 కోట్ల ఆస్తులతో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలవగా 64 కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ మరొకవైపు అగ్రస్దానంలో నిలిచారు. అన్ని రాష్ట్రాల సీఎంలు ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన సమాచారం మేరకు ఇంగ్లీష్ వెబ్ సెట్ ది ప్రింట్ ప్రత్యే కథనం ప్రచురించింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

దేశంలో అత్యంత ధనిక సీఎంగా వైఎస్ జగన్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 370 కోట్లు. స్థిరాస్తుల్లోనూ ఆయనే టాప్ లో ఉన్నారు. రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు 132 కోట్లతో నిలిచారు. అతి తక్కువ ఆస్తులున్న సీఎంగా మమతా బెనర్జీ 15 లక్షల తో నిలిచారు. తరువా స్దానాల్లో కేరళ సీఎం పినరయి విజయ్ 72 లక్షలు, బీహార్ సీఎం నితీష్ కుమార్ 56 లక్షలతో ఉన్నారు. ఐదుగురు ముఖ్యమంత్రులు అవివాహితులు కాగా, సిక్కిం ముఖ్యమంత్రి తమాంగ్ ముగ్గురు భార్యలను కలిగి ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం.

క్రిమినల్ కేసుల విషయానికి వస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ 64 కేసులతో అగ్రస్థానంలో నిలిచారు. ఈ కేటగిరీలో తమిళనాడు సీఎం స్టాలిన్ రెండో స్థానం (47 కేసులు), మూడో స్థానంలో వైఎస్ జగన్ (38) కేసులతో వరుస క్రమంలో ఉన్నారు. ఎటువంటి కేసులు లేని ముఖ్యమంత్రులుగా అశోక్ గెహ్లాత్ (రాజస్థాన్, కాంగ్రెస్), మమతా బెనర్జీ (టీఎంసీ), నవీన్ పట్నాయక్ (బీజేడీ), సంగ్మా (మేఘాలయ), రియో (నాగాలాండ్), రంగస్వామి (పుదుచ్చేరి)లు ఉన్నారు. బీజేపీకి చెందిన 10 ముఖ్యమంత్రుల్లో ఎవరిపైనా కేసులు లేకపోవడం విశేషం.

అస్సాం సీఎం అత్యంతవిద్యావంతుడు

అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ దేశంలోని సిఎంలలో అత్యంత విద్యావంతుడు. అతని అఫిడవిట్ ప్రకారం, అతను తత్వశాస్త్రంలో డాక్టరేట్, రాజనీతి శాస్త్రంలో ఎంఏ మరియు న్యాయశాస్త్రంలో డిగ్రీని కలిగి ఉన్నారు. త్రిపుర సీఎం మానిక్ సాహా డెంటిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు ఢిల్లీ, కర్ణాటక సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, బసవరాజ్ బొమ్మై ఇద్దరూ మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీలు కలిగి ఉండగా, గుజరాత్‌కు చెందిన భూపేంద్ర పటేల్ సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉన్నారు.

ఇవి కూడా చదవండి: