Last Updated:

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు.. గుజరాత్ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు

బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులకు క్షమాబిక్షమంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం నోటీసు జారీ చేసింది.

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు.. గుజరాత్ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు

New Delhi: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులకు క్షమాబిక్షమంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం నోటీసు జారీ చేసింది.

2002 గుజరాత్ అల్లర్ల బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో జీవిత ఖైదీలుగా ఉన్న 11 మందిని విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు దోషులను విడుదల చేసింది.అత్యున్నత న్యాయస్థానం గురువారం ఇలా వ్యాఖ్యానించింది.గుజరాత్ నిబంధనల ప్రకారం, దోషులు క్షమాబిఅర్హులా కాదా అనేది ప్రశ్న. సుప్రీం కోర్టు వారి విడుదల కోసం ఆదేశించలేదు. కానీ పాలసీ ప్రకారం క్షమాబిక్షను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రాన్ని కోరింది.

గుజరాత్ ప్రభుత్వ పాలసీ ప్రకారం ఆగస్టు 15న 11 మంది ఖైదీలను గోద్రా సబ్ జైలు నుంచి విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేర్చాలని పిటిషనర్లను అత్యున్నత న్యాయస్థానం కోరింది.

ఇవి కూడా చదవండి: