Last Updated:

Nirmal District : ఆ రైతుకు చలిమంటే చితిమంటైంది.. ఎంత ఘోరం !

రైతు గాఢ నిద్రలోకి జారుకున్నాక..గాలికి చలిమంట ఉవ్వెత్తున ఎగిసి పాకకు అంటుకున్నాయి.ఆ క్షణాల్లోనే మంటలు పాక మెుత్తం వ్యాపించాయి.చుట్టూ పక్కల ఎవరు లేకపోవడంతో బయటకు రాలేకపోయిన రైతు భూమన్న అక్కడిడక్కడే కాలి బూడిదైపోయాడు.

Nirmal District : ఆ రైతుకు చలిమంటే చితిమంటైంది.. ఎంత ఘోరం !

Eggam: నిర్మల్ జిల్లా ఎగ్గాంలో దారుణం చోటు చేసుకుంది. చలి తీవ్రతను తట్టుకోలేక ఓ రైతు తన పొలంలో వేసుకున్న చలిమంటే అతనికి చితిమంట అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే, బైంసా మండలం ఎగ్గాం గ్రామానికి చెందిన భూమన్న అనే రైతు పందుల బారి నుంచి తన పంటను కాపాడుకునేందుకు సోమవారం రాత్రి పొలానికి వెళ్లాడు. చలి తీవ్రత పెరగటంతో చలిమంట వేసుకొని అక్కడే పడుకున్నాడు. కొంత సేపటికి అనంతరం పక్కనే ఉన్న పాకలోని మంచం పై కునుకు తీశాడు. ఆ కునుకులో ఏమి జరుగుతుందో కూడా చూసుకోలేదు.

రైతు గాఢ నిద్రలోకి జారుకున్నాక, గాలికి చలిమంట ఉవ్వెత్తున ఎగిసి పాకకు అంటుకున్నాయి. ఆ క్షణాల్లోనే మంటలు పాక మెుత్తం వ్యాపించాయి. చుట్టూ పక్కల ఎవరు లేకపోవడంతో బయటకు రాలేకపోయిన రైతు భూమన్న అక్కడిడక్కడే కాలి బూడిదైపోయాడు. ఆలస్యంగా వెలగులోకి వచ్చినా ఈ ఘటన మంగళవారం ఉదయం వ్యవసాయ పనుల కోసం వచ్చిన పక్క పొలం వారు గమనించి విషయాన్ని భూమన్న కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న భూమన్న కుటుంభ సభ్యులందరు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఇవి కూడా చదవండి: