Last Updated:

Hyderabad Metro: సరికొత్త రికార్డు మెట్రో సొంతం

హైదరబాదు మెట్రో రైలు సరికొత్త రికార్డు నెలకొల్పింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా 4లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించిన్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.

Hyderabad Metro: సరికొత్త రికార్డు మెట్రో సొంతం

Hyderabad: జంట నగరవాసులకు చక్కని రవాణా సౌకర్యాల కల్పనలో మెట్రో ఒకటి. 2017 నుండి భాగ్యనగరంలో హైదరాబాదు మెట్రో రైలు పట్టాలెక్కింది. ఆనాటి నుండి నేటి వరకు కోట్లాది మంది ప్రయాణీకులు మెట్రో ద్వారా తమ తమ గమ్యస్థానాలను చేరుకొన్నారు.

తాజాగా గణేష్ నిమజ్జనం సందర్భంగా మెట్రో రైలు 4లక్షల మంది ప్రయాణీకులను ఒక్కరోజే చేరవేసి రికార్డు నెలకొల్పింది. నగరంలో హైదరబాదు నుండి ఎల్ బి నగర్, జూబ్లీ బస్ స్టేషన్ నుండి మహాత్మాగాంధి బస్ స్టేషన్, నాగోల్ నుండి రాయదుర్గం మార్గాల్లో 69.2 కి.మీ మేర మెట్రో తన సేవలను అందిస్తుంది. శుక్రవారం నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి 2గంటల వరకు మెట్రో రైళ్లు నడవడంతో ప్రజలు అధిక సంఖ్యలో మెట్రోలో ప్రయాణించారు.

మూడు కారిడార్లలో మియాపూర్ సెక్షన్ లో 2.46 లక్షలు, జెబిఎస్ మార్గంలో 22 వేలు, నాగోల్ సెక్షన్ లో 1.49లక్షల మంది ప్రయాణించిన్నట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా ఖైరతాబాద్ లో 62వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తూ నిమజ్జన కార్యక్రమాలను భక్తులు వీక్షించారు.

ఇవి కూడా చదవండి: