Last Updated:

Maha Padayatra: కోర్టు షరత్తుల మేరకే పాదయాత్ర

కోర్టు షరత్తులకు లోబడే తొలిరోజు మహా పాద యాత్రను చేపట్టిన్నట్లు జెఏసి నేత స్వరాజ్యరావు మీడియాతో పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయం వద్దు, ఒకే రాజధాని కావాలి అది కూడా అమరావతేనంటూ వెయ్యి రోజులుగా అమరావతి రైతులు చేపడుతున్న దీక్షలు సంగతి తెలిసిందే.నేత స్వరాజ్యరావు మీడియాతో పేర్కొన్నారు

Maha Padayatra: కోర్టు షరత్తుల మేరకే పాదయాత్ర

Amaravathi maha padayatra: కోర్టు షరత్తులకు లోబడే తొలిరోజు మహా పాద యాత్రను చేపట్టిన్నట్లు జెఏసి నేత స్వరాజ్యరావు మీడియాతో పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయం వద్దు, ఒకే రాజధాని కావాలి అది కూడా అమరావతేనంటూ వెయ్యి రోజులుగా అమరావతి రైతులు చేపడుతున్న దీక్షలు సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో రెండవ దఫా అమరావతి నుండి అరసువల్లి వరకు మహా పాద యాత్రను నిర్వాహాకులు చేపట్టారు. అయితే శాంతి భధ్రతల కారణంగా ఎపి డిజిపి అనుమతి నిరాకరించారు. కోర్టు నుండి ప్రత్యేక అనుమతులు తెచ్చుకొనీ మరీ పాదయాత్రను రైతులు, నేతలు చేపడుతున్నారు. తొలి రోజు ప్రారంభంలో వైసిపి పార్టీ మినహాయిస్తే ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ మహా పాదయాత్రలో పాల్గొన్నాయ్.

మరోవైపు తుళ్లూరు మండలం వెంకటాపాళెం నుండి ప్రారంభమైన యాత్రలో శ్రీవారి రధం ఆకర్షణగా నిలిచింది. పాదయాత్ర పలు గ్రామాలు మీదుగా మంగళగిరికి చేరుకోనుంది. రాత్రి అక్కడే బస చేయనున్నారు. రాజధానిగా అమరావతిని ఖరారు చేయాలంటూ   అమరావతి టు దేవస్ధానం అంటూ తిరుమలకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తొలుత పాదయాత్రను చేపట్టివున్నారు.

ఇవి కూడా చదవండి: