Last Updated:

Earthquake: చిత్తూరులో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquake: చిత్తూరులో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

Earthquake: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ముఖ్యంగా పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని అక్కడి స్థానికులు అంటున్నారు.
15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించిందని చెప్తున్నారు. పెద్దశబ్దంతో భూమి కంపించడంతో వస్తువులు కిందపడిపోయాయని, గోడలకు స్వల్పంగా బీటలువారాయని అక్కడి ప్రజలు తెలిపారు.
కాగా, గతంలోనూ ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో వంటి పలు ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయని అధికారులు వెల్లడిస్తున్నారు. దానితో భయానికి గురైన ఆయా గ్రామాల ప్రజలు రాత్రంతా రోడ్ల పైనే గడిపారన్నారు. కాగా ఈసారి మాత్రం ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: రాజధాని తరలింపుకు రంగం సిద్దం చేస్తున్న సీఎం జగన్

ఇవి కూడా చదవండి: