Last Updated:

Syria Government: గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు 400శాతం జీతాల పెంపు!

Syria Government: గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు 400శాతం జీతాల పెంపు!

Syria government salaries 400 per cent hike for employees: సిరియా ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మవద్ అబ్జాద్ ప్రకటించాడు.

ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే విదేశాల్లోని 400 మిలియన్ డాలర్ల విలువైన సిరియన్ ఆస్తులను సైతం విడిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, తాత్కాలిక ప్రభుత్వం 1.65 ట్రిలియన్ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశ వనరుల నుంచి సమకూర్చనుంది.

అయితే ఇటీవల సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్.. రష్యాకు పారిపోయాడు. దీంతో సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. మరో వైపు కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమేనని అరబ్ దేశాలు ప్రకటించాయని ఆ దేశ ఆర్ధిక మంత్రి తెలిపారు.