Last Updated:

Nepal Plane Crash: నేపాల్‌లో రన్ వే పై కుప్పకూలిన విమానం.. 72 మంది మృతి

పాల్‌లో ఘోర విమాన ప్రమాదం ( Plane Crash) చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 72 మంది విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు చాలామంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

Nepal Plane Crash: నేపాల్‌లో రన్ వే పై కుప్పకూలిన విమానం.. 72 మంది మృతి

Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం (Nepal Plane Crash) చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 72 మంది విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో 72 మంది మృతి చెందారు.  నేపాల్‌ లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

కాఠ్‌మాండ్ నుండి పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలినట్లు ఆ దేశ ఎయిర్ లైన్ సిబ్బంది ప్రకటించింది.

ఈ ప్రమాద సమయంలో 72 మంది అందులో ఉన్నట్లు సమాచారం. ఇండియాకు చెందిన ఐదురుగు సైతం ఈ విమానంలో ఉన్నట్లు తెలిసింది.

పూర్తిగా ఇందులో 68 మంది ప్రయాణికులు కాగా.. మరో నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదం పొఖారా విమానాశ్రయం.. పాత విమానాశ్రయం మధ్య చోటు చేసుకొంది.

ఈ ప్రమాద విషయాన్ని యతి ఎయిర్ లైన్స్ అధికారికంగా ధ్రువికరించింది.

ఈ ప్రమాదంలో 72కి గాను 72 మంది మృతి చెందినట్లు చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు

విమానం పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. ప్రమాదం అనంతరం భారీగా మంటలు చెలరేగడంతో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

మంటలు భారీగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో అదనపు భద్రతా సిబ్బందిని నియమించారు.

ఘోరం.. 72 మంది మృతి

ప్రమాదంలో దాదాపు కాలిపోయిన విమానం. విమానానికి చెందిన ఒక్క రెక్క తప్ప పూర్తిగా దగ్ధం.

ఘటనా స్థలంలో చెలరేగుతున్న మంటలు. ప్రాణాలతో బయటపడని ఏ ఒక్కరు.

ప్రమాద సమయంలో 10 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. విమాన ప్రమాదంపై నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ విచారం.

ప్రమాదంపై అత్యవసర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు. భద్రతా దళాలు, హోంశాఖ సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశం.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/