Published On:

Woman Missing: అమెరికాలో భారత యువతి అదృశ్యం.. అసలేం జరిగింది..?

Woman Missing: అమెరికాలో భారత యువతి అదృశ్యం.. అసలేం జరిగింది..?

Indian woman vanishes in US: అమెరికాకు వెళ్లిన ఓ భారత యువతి (24) అదృశ్యమైంది. పెద్దలు కుదిర్చిన వివాహం కోసం వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె కనిపించకుండా పోయింది. ఫిర్యాదు అందుకున్న న్యూజెర్సీ పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

సిమ్రన్‌ అనే యువతి ఈ నెల 20వ తేదీన భారత్‌ నుంచి న్యూజెర్సీకి చేరుకుంది. ఐదు రోజుల తర్వాత కనిపించకుండా పోయింది. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు పెద్దలు కుదిర్చిన వివాహం కోసం ఆమె అమెరికా వచ్చినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. యువతికి స్థానికంగా బంధువులు లేరని, ఇంగ్లిష్ కూడా రాదని గుర్తించారు. సిమ్రన్‌ వద్ద ఉన్న ఫోన్‌ కేవలం వైఫై ద్వారా పనిచేస్తుందని, ఆమె ఆచూకీ గురించి తెలుసుకునేందుకు భారత్‌లో ఉన్న కుటుంబ సభ్యులను సంప్రదించలేకపోయామని వెల్లడించారు.

 

లైడెన్‌వోల్డ్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఓ చోట ఆమె తన ఫోన్‌ను చూసుకుంటూ ఎవరికోసమో వేచిచూస్తున్నట్లు గుర్తించారు. ఆమెకు వివాహం చేసుకునే ఉద్దేశం లేదని, కేవలం అమెరికాకు ఉచితంగా వచ్చేందుకే దీన్ని సాకుగా చూపిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: