Last Updated:

Jeera Rice: రుచికి, ఆరోగ్యానికి జీరా రైస్

మ‌నం సాధార‌ణంగా అన్నంతో త‌యారు చేసే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌లో జీరా రైస్ ఒక‌టి. జీరా రైస్ చాలా రుచిగా ఉంటుంది. కూర‌ను త‌యారు చేసే స‌మ‌యం లేన‌ప్పుడు అన్నంతో జీరా రైస్ ను త‌యారు చేసుకొని తిన‌వ‌చ్చు. అంతే కాకుండా జీల‌క‌ర్ర‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ వంటి

Jeera Rice: రుచికి, ఆరోగ్యానికి జీరా రైస్

Jeera Rice: మ‌నం సాధార‌ణంగా అన్నంతో త‌యారు చేసే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌లో జీరా రైస్ ఒక‌టి. జీరా రైస్ చాలా రుచిగా ఉంటుంది. కూర‌ను త‌యారు చేసే స‌మ‌యం లేన‌ప్పుడు అన్నంతో జీరా రైస్ ను త‌యారు చేసుకొని తిన‌వ‌చ్చు. అంతే కాకుండా జీల‌క‌ర్ర‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. ఈ జీరా రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. ఎలా త‌యారు చేసుకోవాలనేది చూద్దాం.

జీరా రైస్ తయారీకి కావాల్సిన ప దార్థాలు..

ఉడికించి చల్లార్చిన అన్నం , నూనె – 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు -ఒకటి, యాలకులు – 2 , ల వంగాలు – 3, దాల్చిన చెక్క – 2 (చిన్న ముక్క), జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి, – 6 లేదా 7 ఉప్పు – రుచికి స‌రిప‌డా, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, మిరియాల పొడి – పావు టీ స్పూన్‌.

జీరా రైస్ తయారీ విధానం..

ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి పై వేయించుకోవాలి. ఇవి వేగాక జీల‌క‌ర్ర వేసి వేయించుకోవాలి. త‌రువాత ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక రుచికి స‌రిప‌డా ఉప్పును వేసి క‌లుపుకోవాలి. ఇవి పూర్తిగా వేగాక, ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని బాగా కలుపుకోవాలి. త‌రువాత మిరియాల పొడి వేసి క‌లిపి మూత పెట్టి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు ఉంచిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వేడి వేడిగా రుచిగా ఉండే జీరా రైస్ త‌యార‌వుతుంది. జీరా రైస్ ను నేరుగా లేదా కుర్మా వంటి కూర‌ల‌తో క‌లిపి తిన‌డం వ‌ల్ల చాలా రుచిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి: