Mushroom Curry: రెస్టారెంట్ స్టైల్ ఆంధ్ర మష్రూమ్ కర్రీ తయారీ విధానం
మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. మష్రూమ్స్ తో మనం ఎప్పటికప్పుడు కొత్త వంటలను ట్రై చేసుకొని తినవచ్చు. కొత్తగా మష్రూమ్స్ తో వంటలు చేస్తే తిననివారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
Restaurant Style Mushroom Curry: మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. మష్రూమ్స్ తో మనం ఎప్పటికప్పుడు కొత్త వంటలను ట్రై చేసుకొని తినవచ్చు. కొత్తగా మష్రూమ్స్ తో వంటలు చేస్తే తిననివారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కొత్తగా ఆంధ్ర స్టైల్లో మష్రూమ్ కర్రీ రెసిపీని ఈ విధంగా ట్రై చెయ్యండి. ఇంకెందుకు ఆలస్యం దీనికి కావలిసిన పదార్ధాలు మరియు తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
కావలిసిన పదార్ధాలు..
పుట్టగొడుగులు : 1/4 కేజి, ఉల్లిపాయలు : మూడు, పచ్చిమిర్చి : రెండు, కారం : టీ స్పూను, పసుపు : పావు టీ స్పూను, కొత్త మీర :ఒక కట్ట, నూనె : వేయించడానికి సరిపడా, ఉప్పు : తగినంత తీసుకోవాలి.
తయారు చేసే విధానం..
పుట్ట గొడుగులని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లి పాయలు, పచ్చి మిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పాన్ తీసుకొని దానిలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. అవి వేగిన తరువాత పుట్టగొడుగుల ముక్కలను, పసుపు, కారం వేసి 10 నిముషాలు ఉంచాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత దించే 6 నిముషాల ముందు కొట్టి మీరను వేసి దించుకోవాలి.