coriander rice: తక్కువ సమయంలో రుచిగా తయారయ్యే కొత్తిమీర రైస్
కొత్తిమీరను రోజూ మనం అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. అయితే కొత్తిమీరతో రైస్ తయారు చేసుకుని తినవచ్చు. చాలా తక్కువ సమయంలో రుచిగా ఆరోగ్యంగా వుండే మరి కొత్తిమీర రైస్‌ను ఎలా తయారు చేయాలో, ఇప్పుడు తెలుసుకుందాం.
coriander rice: కొత్తిమీరను రోజూ మనం అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. అయితే కొత్తిమీరతో రైస్ తయారు చేసుకుని తినవచ్చు. చాలా తక్కువ సమయంలో రుచిగా ఆరోగ్యంగా వుండే మరి కొత్తిమీర రైస్‌ను ఎలా తయారు చేయాలో, ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం, కొత్తిమీర, పచ్చి మిర్చి – 5 లేదా 6, తరిగిన క్యారెట్ ముక్కలు – ఒక కప్పు, పచ్చి బఠానీ – అర కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, , దాల్చిన చెక్క – 2యాలకులు – 3, లవంగాలు – 5, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు, నూనె.
ముందుగా అన్నాన్ని ఆరబెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో కొత్తిమీర, పచ్చి మిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగాక ముందుగా పేస్ట్ లా చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మూతపెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలపాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరో సారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉంచిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ తయారవుతుంది.