Published On:

Santhana Prapthirasthu Teaser: సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. బాడీ ఒక్కటే పని చేస్తోంది..మిగతావేవీ పనిచేయవు

Santhana Prapthirasthu Teaser: సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. బాడీ ఒక్కటే పని చేస్తోంది..మిగతావేవీ పనిచేయవు

Santhana Prapthirasthu Teaser: ఈ మధ్య టాలీవుడ్ లో కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తున్నారు మేకర్స్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయి అనే అనుమానాలు ప్రేక్షకుల్లో రాకమానదు. తాజాగా మరో కొత్త కథతో ప్రేక్షకులను షేక్ చేయడానికి వస్తున్నారు మధుర శ్రీధర్. మంచి మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.  హీరో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అతనికి జాబ్ తప్ప ఇంకేమి తెలియదు. ఇక హీరోకు, హీరోయిన్ పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోకపోతే  పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటారు.

SSMB29: ఒరిస్సాలో మహేష్‌-రాజమౌళి మూవీ సెకండ్‌ షెడ్యూల్‌ – లోకేషన్‌ ఫోటోలు లీక్‌!

ఇక హీరోయిన్ తండ్రి.. తన కూతురిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావ్ కదా.. ఆమె 100 రోజుల్లో తిరిగి నా దగ్గరకు రాకుండా చూసుకో అని చెప్తాడు. దీంతో  భార్యను ప్రెగ్నెంట్ ను చేస్తే ఆమె తిరిగి వెళ్లదు అనుకోని..  తల్లిని చేయాలనుకుంటాడు. కానీ, హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడంతో.. హీరోయిన్ తల్లి కాలేదు. ఇక దానివలన హీరో ఎంత ఇబ్బంది పడ్డాడు.. ? మామతో చేసిన ఛాలెంజ్ గెలిచాడా.. ? 100 రోజుల్లో భార్యను ప్రెగ్నెంట్ చేశాడా.. ? హీరోకు పరిచయమైన వెన్నెల కిషోర్ ఎవరు.. ? తరుణ్ భాస్కర్ ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్రస్తుతం సమాజంలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బయట ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు అనేది టీజర్ లో చూపించారు. డబ్బులు ఎక్కువ వస్తున్నాయని.. ఆశపడి ఎంతోమంది సాఫ్ట్ వేర్ గా మారుతున్నారు. కానీ, అక్కడ ఉండే ఒత్తిడివలన హెల్త్ బాగోకపోవడం, ఆ ఒత్తిడి వలన స్పెర్మ్ కౌంట్ పడిపోవడం, ఇంట్లో గొడవలు, చికాకులు.. ఇలా చాలా అంశాలను ఇందులో చూపించారు. టీజర్ తోనే సినిమాపై ఒక హైప్  క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే సంతాన ప్రాప్తిరస్తు థియేటర్ లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.