Last Updated:

Karthika Deepam: అక్టోబర్ 14 ఎపిసోడ్ లో మోనిత మీద రగిలిపోతున్న కార్తీక్

అక్టోబర్ 14 ఎపిసోడ్ లో మోనిత మీద రగిలిపోతున్న కార్తీక్

Karthika Deepam: అక్టోబర్ 14 ఎపిసోడ్ లో మోనిత మీద రగిలిపోతున్న కార్తీక్

Karthika Deepam: నేటి  కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ  రెండు సీన్లు హైలెట్

కార్తీక్ కోపంగా లోపలికి వెళ్లిపోవడంతో…ఇక మోనిత దుర్గ మీద రెచ్చిపోతుంది.‘రేయ్ నీ అంతు చూస్తాను..కార్తీక్‌కి నా పైన అనుమానం కలిగేలా చేస్తావా? నీ అంతు చూస్తా’ నిన్ను ఇంక విడిచిపెట్టను రా అంటూ రెచ్చిపోతుంది.‘అవన్నీ తర్వాత చూద్దువుగానీ..ఒసేయ్ ముందు నీ భవిష్యత్ చూసుకో’ అంటూ దుర్గ వెటకారంగా నవ్వేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక కార్తీక్ తన గదిలోకి వెళ్లి..బాగా ఆలోచిస్తాడు.‘అమ్మా వాళ్లు ఎక్కడున్నారు? నా పరిస్థితి గురించి ఇంకా వాళ్లకి తెలియదా? యాక్సిడెంట్‌లో నేను పోయానని అనుకుంటున్నారా? అదే జరిగి ఉంటుంది..లేదంటే ఇన్ని రోజులు నా దగ్గరకు రాకుండా ఎలా ఉంటారు? ఎంత పని చేశావ్ మోనితా..’ అంటూ మోనిత మీద రగిలిపోతాడు.

నేను ప్రాణాలతో ఉండి కూడా అందరికీ దూరంగా.. ఎవరితోనూ ఏ సంబంధం లేకుండా ఉంచడానికి నీకేలా మనసొచ్చింది మోనితా ? అసలు దీప ఇక్కడెందుకు ఉంది..తను హైదరాబాద్ వెళ్ళకుండా… నేను మోనిత భర్తగా ఎందుకు ఉన్నాను? ఎక్కడా ఏదో తేడా జరిగింది? దీప ఒక్కటే ఇక్కడ ఉంటే మరి పిల్లలు ఎక్కడా? అంటే సౌర్య వారణాసి ఇక్కడే ఉన్నారుగా’ అంటూ ఆ రోజు వినాయకుడి బొమ్మలు కొన్న సీన్ గుర్తుకు చేసుకుంటాడు. ‘మరి ఈ విషయం దీపకు తెలియదా? అంటూ ఐనా ఇక్కడ సౌర్య బొమ్మలు అమ్ముతుందేంటీ? ఆ రౌడీ బొమ్మలు అమ్మడం ఏంటీ? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది?’ అంటూ కార్తీక్ తల పట్టుకుని అల్లాడిపోతుంటాడు.