Last Updated:

Karthika Deepam: సెప్టెంబర్ 28 ఏపిసోడులో మోనితకు దెబ్బ గట్టిగానే తగిలినట్టు ఉంది !

Karthika Deepam: సెప్టెంబర్ 28 ఏపిసోడులో మోనితకు దెబ్బ గట్టిగానే తగిలినట్టు ఉంది !

Karthika Deepam: సెప్టెంబర్ 28 ఏపిసోడులో మోనితకు దెబ్బ గట్టిగానే  తగిలినట్టు ఉంది !

Karthika Deepam: నేటి కార్తీకదీపం సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్

మోనిత ఇంటికి వచ్చి..కార్తీక్ కార్తీక్ అని పిలుస్తూ వెతుకుతూ ఉంటుంది…ఎంత వెతికినా కార్తీక్ కనిపించడు.ఇంతలో శివ పరుగున వచ్చి..‘మేడమ్ కార్తీక్ సార్ ఇంట్లో లేరు..వంటలక్క సార్ ని వచ్చి తీసుకుని బయటికి వెళ్లిందని చెబుతాడు…ఆ మాటకు శివని లాగిపెట్టి చెంప మీద కొడుతుంది మోనిత.ఒరేయ్ నీకు ఏమి చెప్పా.. నువ్వు ఏమి చేస్తున్నావ్ ‘ఆవిడతో ఎందుకు పంపిచావ్.. ఇప్పుడు ఆయన్ని ఎటు తీసుకెళ్లిందో ఏమో అంటూ తెగ కంగారూ పడుతుంది.

‘మేడమ్..మన కాలనీలో ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయి అంటగా… సొసైటీ హాల్లో వంటలక్క కూడా నాటకం వేస్తుందంట..ఆమె వేసే నాటకాన్ని చూడాటానికి..సార్ ఆవిడతో కలిసి బయటికి వెళ్లారు…నేనేం అపలేకపోయానని..మేడమ్ అని ఏడుపు ముఖం పెడతాడు.అప్పుడు మోనిత ఒక్కసారిగా ‘ఛా నిన్ను నమ్ముకుని నీకు వదిలి వెళ్లాను చూడు అది నేను చేసిన తప్పు’ అనుకుంటూ పరుగుతీస్తుంది మోనిత.‘డౌటే లేదు.. అందరి పెళ్లాలు ఇలానే ఉంటున్నారా? ఈ మేడమ్ ఏంటి..ఎప్పుడు వేరే లాగే ఆలోచిస్తాది.. ఇప్పుడు అర్దం అవుతుంది ఈవిడ ఖచ్చితంగా కార్తీక్ సార్ భార్య కాదు..’ మనసులో అనుకుంటాడు శివ.మోనిత ఆ నాటకం జరిగే ఫంక్షన్ హాల్ కు వెళ్లి చూస్తే అక్కడంతా ఖాళీగా ఉంటుంది.ఎవరు కనిపించరు.తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుకుందాం.