Last Updated:

Karthika Deepam: అక్టోబర్ 10 ఎపిసోడ్‌ లో దుర్గా ఎంట్రీ మామూలుగా లేదుగా!

టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. ఈరోజు 2022 అక్టోబర్ 10 ఎపిసోడ్‌ హైలైట్స్ ఏమిటో చూద్దాం.

Karthika Deepam: అక్టోబర్ 10 ఎపిసోడ్‌ లో దుర్గా ఎంట్రీ మామూలుగా లేదుగా!

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం ఎపిసోడులో ఈ రెండు సీనులు హైలెట్. మోనితా నువ్వేం భయపడకు, దీపని తిట్టిండానికి, ఈ ఊరు నుంచి తరిమి కొట్టడానికి నేను మరో నలుగుర్ని ఆల్ రెడీ ఏర్పాటు చేశాను’ అంటూ మోనితకు ధైర్యాన్ని చెప్పి అక్కడి నుంచి కావేరీ వెళ్తుంది. మరోవైపు దుర్గ బండి మీద ఆ ఊరిలోకి ఎంట్రీ ఇస్తాడు.‘దీపమ్మ చెప్పిన ఊరు ఇదే కదా అంటూ ఆ ఊరికి వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు. అప్పుడే దీప వాళ్ల అన్నయ్య కంటపడతాడు దుర్గ. ‘దుర్గా, దీప మా ఇంట్లోనే ఉంది’ అని అనడంతో ‘అవునా సార్, సరే అయితే, నేను ఓ సారి వెళ్లి మోనిత దగ్గరికి వెళ్ళి ఒక జలక్ ఇచ్చి వస్తాను’ అంటూ బండి ముందుకు పోనిస్తాడు.

ఇంతలో కార్తీక్ మోనితతో ‘మోనితా ఇది మా ఊరే అంటున్నావ్, చుట్టు ఎంతమంది ఉన్నా వీళ్లెవ్వరూ నా వాళ్లు కాదని అనిపిస్తోంది. నేను ఒంటరివాడ్ని అని అనిపిస్తోంది మోనితా, కార్తీక్ అంటాడు దిగులుగా. ‘నీకు ఎక్కడో అనుమానం ఉండిపోయింది కార్తీక్, వాళ్లందరి గురించి నువ్వు అసలు ఆలోచించకు నీకు నేను ఉన్నాను కదా అంటూ కార్తీక్కు మాయ మాటలు చెబుతుంది. అప్పుడే దుర్గ మోనిత దగ్గరకు వచ్చి,‘కలొద్దామని చెప్పి మీరిద్దరూ ఇలా వచ్చేస్తారా, చూడు బండి మీద వచ్చేసరికి నాకు ఒళ్లంతా నొప్పులుగా ఉందని అని అంటాడు. ఆ మాటలకు మోనిత షాక్ ఐపోతుంది. తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడులో తెలుసుకుందాం.

 

ఇదీ  చదవండి : అక్టోబర్ 08 ఎపిసోడ్ ” నువ్వు నా భర్తని ఎక్కడికెళ్లినా వదిలిపెట్టవా ” అంటున్న దీప

ఇవి కూడా చదవండి: