Actor Sarath Babu : నేడు చెన్నైలో జరగనున్న నటుడు శరత్ బాబు అంత్యక్రియలు..
ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు మే 22 న మరణించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే నిన్న కన్నమూశారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధే పాత్రల్లో నాటికంహరు శరత్ బాబు. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు
Actor Sarath Babu : ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు మే 22 న మరణించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే నిన్న కన్నమూశారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధే పాత్రల్లో నాటికంహరు శరత్ బాబు. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు 250 కి పైగా సినిమాల్లో నటింకచ్చి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన మరణంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
కాగా నిన్న అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. అనంతరం నిన్న రాత్రి శరత్ బాబు భౌతికకాయాన్ని చెన్నైకు తరలించారు. నేడు మధ్యాహ్నం వరకు చెన్నైలోనే శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నైలో కూడా పలువురు తమిళ సినీ ప్రముఖులు వచ్చి ఆయనకు నివాళులు అర్పించనున్నారు. కాగా ఇప్పటికే శరత్ బాబు భౌతికకాయం చెన్నైలోని టీనగర్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుందని సమాచారం అందుతుంది.
శరత్ బాబు నటి రమాప్రభను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. రమాప్రభ శరత్ బాబు కంటే నాలుగేళ్లు వయసులో పెద్ద ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శరత్ బాబు. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడా ఓ పాత్రలో కనిపించారు శరత్ బాబు. ఇక నరేష్ – పవిత్ర కలిసి నటించిన మళ్ళీ పెళ్లి సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో నటించారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
శరత్ బాబు ఆంధ్రప్రదేశ్ ఆముదాలవలసలో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. 1973 లో విడుదల అయిన ‘రామరాజ్యం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా పలు పురస్కారాలను కూడా అందుకున్నారు. ఆయన నటనకు గానూ 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి ‘సీతాకోక చిలుక’ సినిమాకు అవార్డును అందుకున్నారు. తర్వాత ‘ఓ భార్య కథ’, ‘నీరాజనం’ సినిమాలకు గానూ పలు అవార్డులు అందుకున్నారు.