Last Updated:

IOCL Recruitment 2022: నిరుద్యోగులు త్వరపడండి.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 1535 ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త. అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)రిఫైనరీస్ డివిజన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1535 పోస్టులను భర్తీ చేయనున్నారు.

IOCL Recruitment 2022: నిరుద్యోగులు త్వరపడండి.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 1535 ఉద్యోగాలు

IOCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త. అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)రిఫైనరీస్ డివిజన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1535 పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐవోసీఎల్‌ రిఫైనరీల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతుంది.  గువాహటి, బరౌని, గుజరాత్, హల్దియా, మధుర, పానిపట్, దిగ్బోయి, బొంగైగావ్, పారాదీప్‌ తదితర ప్రాంతాల్లోని రిఫైనరీల్లో ఈ ఖాళీలున్నాయి.

  •  అక్టోబర్‌ 23 దరఖాస్తులకు చివరితేది.
  • మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
  • ఖాళీని అనుసరించి 12/15/24 నెలలు వరకు శిక్షణాకాలం ఉంటుంది.
  • 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.
  • రాత పరీక్ష, విద్యార్హత ప్రమాణాలు, ఫిజికల్ ఫిట్‌నెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
  • అభ్యర్థులు ఇతర పూర్తి వివరాల కోసం https://www.iocl.com/ వెబ్‌సైట్‌ సంప్రదించండి.

ఇదీ చదవండి: India Post Recruitment 2022: ఎనిమిదవ తరగతి పాస్ అయ్యారా.. ఐతే ఈ ఉద్యోగాలు మీ కోసమే!

ఇవి కూడా చదవండి: