Last Updated:

Vastu Tips : లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిదట..!

సాధారణంగా వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా గృహ నిర్మాణం విషయంలో, ఇంటి దోషాలను తొలగించడానికి ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. అయితే ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీ దేవి కటాక్షం ఎక్కువగా ఉండదో అలాంటి వారి కోసం కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు చేయబడ్డాయి. ఈ చిట్కాలను పాటించి మళ్ళీ వారి జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నింపవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Vastu Tips : లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిదట..!

Vastu Tips : సాధారణంగా వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా గృహ నిర్మాణం విషయంలో, ఇంటి దోషాలను తొలగించడానికి ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. అయితే ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీ దేవి కటాక్షం ఎక్కువగా ఉండదో అలాంటి వారి కోసం కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు చేయబడ్డాయి. ఈ చిట్కాలను పాటించి మళ్ళీ వారి జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నింపవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

చెప్పులు..

వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రి పడుకునే ముందు ఇంటి ముఖద్వారాన్ని శుభ్రంగా ఉంచండి. ఇంటి ప్రవేశ ద్వారం నుండి చెప్పులు, బూట్లను తొలగించాలి . ఎందుకంటే లక్ష్మీదేవి ఈ ద్వారం నుండి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంటి ప్రవేశ ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

దీపం వెలిగించండి.. 

రాత్రి నిద్రపోయే ముందు పూజగదిలో నెయ్యి దీపం వెలిగించండి. ప్రతిరోజూ దీపం వెలిగిస్తే ఆ కుటుంబంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని నమ్మకం. ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవిని స్థిరంగా ఉంటుంది.

కర్పూరం..  

వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయే ముందు కర్పూరాన్ని కాల్చండి. బెడ్‌రూమ్‌తో పాటు గది మొత్తం మీద కర్పూరం పొగ వెళ్లేలా చూడండి. కర్పూరాన్ని కాల్చడం వల్ల ప్రతికూల శక్తి పోతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నురాలవుతుంది.

మరికొన్ని చిట్కాలు (Vastu Tips).. 

ఇంటి దక్షిణ దిశలో పూర్వీకులు నివసిస్తారని చెబుతుంటారు. కనుక ఆ దిశలో ఆవ దీపం వెలిగిస్తే పూర్వీకులు సుఖసంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదిస్తారని సూచిస్తున్నారు. రాత్రంతా దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే.. చిన్న బల్బును అయిన పెట్టాలని అంటున్నారు.

అదే విధంగా రాత్రిపూట ఇంటికి తూర్పు మూల, ఉత్తరం వైపు శుభ్రం చేయాలని.. అక్కడ గ్రంధాల ప్రకారం కుబేరుడు నివసిస్తాడని విశ్వసిస్తారు.

అలానే రాత్రి పడుకునేటప్పుడు మీ పాదాలు తలుపుకు ఎదురుగా ఉండకూడదు. తలుపు వైపు కాలు పెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం తొలగిపోతుందని నమ్ముతారు.