TTD: డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించిన టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధికారులు పెద్దపీట వేశారు. సెప్టెంబరు 27 నుండి శ్రీవారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోసామాన్య భక్తులకు సులభంగా, శ్రీఘ్రంగా స్వామివారి దర్శనంతో పాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పిస్తామని ఈవో ధర్మరెడ్డి తెలిపారు.
Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధికారులు పెద్దపీట వేశారు. సెప్టెంబరు 27 నుండి శ్రీవారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోసామాన్య భక్తులకు సులభంగా, శ్రీఘ్రంగా స్వామివారి దర్శనంతో పాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పిస్తామని ఈవో ధర్మరెడ్డి తెలిపారు.
తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో ధర్మరెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబర్ 2న స్వర్ణరథం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం నిర్వహిస్తామన్నారు.
రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేశామని ధర్మరెడ్డి తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నమని ధర్మరెడ్డి వెల్లడించారు.