Last Updated:

Horoscope Today: నేడు ఈ రాశి వారికి సంపద పెరిగే అవకాశం.. 12 రాశుల ఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం.

Horoscope Today: నేడు ఈ రాశి వారికి సంపద పెరిగే అవకాశం.. 12 రాశుల ఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం: నేడు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాదనుకున్ననగదు చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.
పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. తొందర పాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంటుంది.

వృషభం: నేడు ఈ రాశి వారి జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రావాల్సిన నగదు చేతికి అందుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు ఒక్కొక్కటి పూర్తవుతాయి. అనవసర ఖర్చుల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.
వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. గతంలో కుటుంబ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి.

ఈ రాశివారికి అనుకూల సమయం

మిథునం: అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్ధికంగా నేడు కలసివస్తుంది. పరోపకార బుద్ధితో ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. కుటుంబానికి సంబంధించి ఓ శుభావార్త వింటారు. నిరుద్యోగులకు మంచి అవకాశం. మంచి కంపెనీలో ఉద్యోగం రావచ్చు.

కర్కాటకం: ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా ఒత్తిడి ఉంటుంది. చేయాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతారు. అనవసరం ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. నగదు విషయంలో పొదుపు పాటించాలి. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

సింహం: వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మిత్రులకు సాయం చేసే విషయంలో ఆలోచించాలి. ఆర్ధిక విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. బంధువులు స్నేహితులు మీకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది.

కన్య: ఉద్యోగంలో అనుకోకుండా అపార్ధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో పని భారం బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొద్దిగా డబ్బు మోసపోయే ప్రమాదం ఉంది.

తుల: నేడు ఈ రాశివారికి సమయం కలసివస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రస్తుతానికి అనారోగ్యాలేవీ దగ్గరకు రాకపోవచ్చు. దూర ప్రాంతం నుంచి ఆశించిన తీపి కబురు అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.

వృశ్చికం: ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

ఆరోగ్యం విషయం జాగ్రత్తలు పాటించాలి. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్ధిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

ధనుస్సు: వ్యక్తిగత సమస్య ఒకటి అనుకో కుండా పరిష్కారం అయ్యి కొద్దిగా మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు వెళ్లకపోవచ్చు. ఉద్యోగంలో సహచరుల సహాయంతో లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు.

వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

నేడు ఈ రాశికి సంపద పెరిగే అవకాశం..

మకరం: నేడు ఈ రాశివారికి సంపద పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. డబ్బు విషయంలో పొదుపు పాటించాలి.

ఉద్యోగం జీవితం సాఫీగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటి రంగానికి చెందినవారు బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశి వారికి కష్టేఫలి అనే సూత్రం బాగా వర్తిస్తుంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. కుటుంబపరంగా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ఈ రాశి వారి శక్తి సామర్థ్యాలను గుర్తించిన అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది.

మీనం: ఆర్ధిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి.

ఉద్యోగం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. డాక్టర్లకు, లాయర్లకు గౌరవ మర్యాదలు పెరుగు తాయి.