Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారని తెలుస్తుంది. అలాగే సెప్టెంబర్ 7 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారని తెలుస్తుంది. అలాగే సెప్టెంబర్ 7 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ఆస్తుల కొనుగోలు వ్యవహారం మంచిగా ముగుస్తుంది. ఆశించినంతగా ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి.

వృషభం..

వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మిథునం..

కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పెద్దల సహకారంతో ఆస్తి వివాదం ఒకదానిని చక్కబెడతారు. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదగడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

కర్కాటకం..

వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది

సింహం..

ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సా హకాలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కన్య..

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలుంటాయి. ఆరోగ్య పరంగా కొద్దిగా శ్రద్ధ వహించాలి. ఆస్తి విషయంలో తోబుట్టువులతో సమస్యలు తలెత్తుతాయి.

తుల..

దగ్గర బంధువుల సహాయంతో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. పిల్లల్లో ఒకరికి విద్య లేదా ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ జీవితం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం..

ఆస్తి వివాదాన్ని పరిష్కరించడానికి చేసే ప్రయత్నాలలో తోబుట్టువులతో ఇబ్బందులు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారం చేపట్ట డానికి అవకాశం ఉంది. కొద్దిపాటి ఆర్థికాభివృద్ధి సూచనలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

ధనస్సు..

ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువులకు సంబంధించిన ఒక శుభకార్యంలో పాల్గొంటారు.

మకరం..

అత్యవసర వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణతో పాటు ప్రోత్సాహకాలు కూడా అందుకుంటారు. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులు సానుకూల సమాచారం అందుకునే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు కొదువ ఉండదు.

కుంభం..

కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. కొందరు మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆస్తి వివాదం విషయంలో సోదరులతో రాజీమార్గం అనుసరిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు స్నేహితుల సహాయంతో పూర్తవుతాయి.

మీనం..

ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా ముందుకు దూసుకుపోతాయి .