Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారి మనసులోని కోరికల్లో ఒకటి రెండు అనుకోకుండా నెరవేరుతాయని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారి మనసులోని కోరికల్లో ఒకటి రెండు అనుకోకుండా నెరవేరుతాయని తెలుస్తుంది. అలాగే జూలై 31 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారి మనసులోని కోరికల్లో ఒకటి రెండు అనుకోకుండా నెరవేరుతాయని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారి మనసులోని కోరికల్లో ఒకటి రెండు అనుకోకుండా నెరవేరుతాయని తెలుస్తుంది. అలాగే జూలై 31 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం.

వృషభం..

వృత్తి, ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మనసులోని కోరికల్లో ఒకటి రెండు అనుకోకుండా నెరవేరుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. దాయాదులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

మిథునం..

ఉద్యోగంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. వారి సలహాలు, సూచనలు కూడా ఉపకరి స్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం..

బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పనులు, వ్యవ హారాలు, కార్యకలాపాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించడం భావ్యం కాదు. వృత్తి, ఉద్యోగాల వాతావరణం కొంత వరకూ సాఫీగా సాగిపోతుంది.

సింహం..

పిల్లల్లో ఒకరికి దూరప్రాంతంలో మంచి ఉద్యోగం లభించడం గానీ, ఉన్నత విద్యకు అవకాశం లభించడం గానీ జరుగుతుంది. పిల్లల విజ యాలు ఆనందోత్సాహాలలో ముంచెత్తుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది.

కన్య..

కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అంతకు మించి ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరుగా ముందుకు సాగుతాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి పనులకు దూరంగా ఉండడం మంచిది.

తుల..

బంధుమిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడడానికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలలో కూడా ఎంజాయ్ చేస్తారు.

వృశ్చికం..

నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం కనిపిస్తోంది. వ్యక్తిగత సమస్య పరిష్కారంలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సా హం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి.

ధనస్సు..

అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరు గుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మకరం..

జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుంభం..

వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుని సమస్యను పరిష్కరించుకుం టారు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండాలి.

మీనం..

ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వ్యాపా రాల మీద పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల అండతో ఉన్నత పదవి దక్కే సూచనలున్నాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.