Astrology Tips : జ్యోతిష్యం ప్రకారం ఈ రంగు చెప్పులను ధరించకూడదని తెలుసా..?
ప్రస్తుతం ఈ ప్రపంచం వేగంగా అభివృద్ది చెందుతుంది. మారుతున్న కాలానుగుణంగా మనుషులు కూడా మారుతూ వస్తున్నారు. వారి వస్త్రధారణ విషయంలో కావచ్చు. జుట్టు నుండి పాదరక్షల వరకు అన్నీ విషయాల్లో ఫ్యాషన్ గా ఉండాలనుకుంటారు చాలా మంది. అయితే అది వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.
Astrology Tips : ప్రస్తుతం ఈ ప్రపంచం వేగంగా అభివృద్ది చెందుతుంది. మారుతున్న కాలానుగుణంగా మనుషులు కూడా మారుతూ వస్తున్నారు. వారి వస్త్రధారణ విషయంలో కావచ్చు. జుట్టు నుండి పాదరక్షల వరకు అన్నీ విషయాల్లో ఫ్యాషన్ గా ఉండాలనుకుంటారు చాలా మంది. అయితే అది వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. ముఖ్యంగా వారు ధరించే చెప్పులు, బూట్లు రంగులు కూడా వారి జీవితంపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కాగా ఈ మేరకు రంగురంగుల బూట్లు లేదా చెప్పులు ఎందుకు ధరించకూడదు. అలా వేసుకుంటే దురదృష్టం, ఆర్థిక సమస్యలు ఎందుకు వెంటాడుతాయి. జీవితంలో సమస్యలు తెచ్చిపెట్టే ఆ రంగుల చెప్పులు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
ఒక వ్యక్తి పాదాలలో శని నివసిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో బూట్లు, చెప్పులు శని, రాహు గ్రహాలకు సంబంధించినవి. ఎవరి రాశిలో శని, రాహువు ఉచ్ఛస్థితిలో ఉన్నారో అలాంటి వ్యక్తులు బూట్లు, చెప్పుల వ్యాపారంలో పురోగతిని పొందుతారని తెలుస్తుంది.
ఏ రంగు చెప్పులు లేదా బూట్లు ధరించకూడదు అంటే (Astrology Tips) ..
పసుపు రంగు చెప్పులు, పసుపు రంగు బూట్లు లేదా కొనవద్దు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పసుపు రంగు బృహస్పతి రంగుగా పరిగణిస్తారు. ఈ రంగు బూట్లూ లేదా చెప్పులు ధరిస్తే జాతకంలో బృహస్పతి బలహీనపడతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని, ఖర్చులు భారీగా పెరిగి ఆదాయం తగ్గుతుందని అంటున్నారు. అలానే పిల్లలు, పెళ్లి, వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
ఒక వ్యక్తి యొక్క చంద్రుడు చెడు స్థానంలో ఉంటే, అటువంటి వ్యక్తులు తెలుపు రంగు బూట్లు ధరించడం మానుకోవాలని జ్యోతిష్యశాస్త్రంలో చెప్పబడింది.
పాదరక్షలు ధరించేటప్పుడు జాగ్రత్తలు ఎవరైనా చెప్పులను బహుమతిగా ఇస్తే వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ధరించవద్దు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, నలుపు, నీలం, ఊదా రంగుల్లోని బూట్లు ధరించవచ్చు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/