Last Updated:

Dimple Hayathi: ’డింపుల్ ను డీసీపీ వేధించాలనుకున్నారు..‘ – నటి లాయర్

రామబాణం ఫేం డింపుల్ హయతి, డీసీపీ రాహుల్ హెగ్డే వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా డింపుల్ తరపు న్యాయవాది పలు విషయాలను వెల్లడించారు.

Dimple Hayathi: ’డింపుల్ ను డీసీపీ వేధించాలనుకున్నారు..‘ – నటి లాయర్

Dimple Hayathi: రామబాణం ఫేం డింపుల్ హయతి, డీసీపీ రాహుల్ హెగ్డే వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా డింపుల్ తరపు న్యాయవాది పలు విషయాలను వెల్లడించారు. ‘డింపుల్ హయాతిపై కావాలనే తప్పుడు కేసు పెట్టారు. రోడ్డు మీద ఉండాల్సిన సిమెంట్ బ్రిక్స్ అపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చాయి? ఈ విషయాన్ని దాదాపు రెండు నెలలుగా అడుగుతున్నాము. డీసీపీ రాహుల్ చాలాసార్లు డింపుల్ తో అమర్యాదగా మాట్లాడారు. అదే విధంగా ఆమె పార్కింగ్ స్థలంలో కోన్స్ ఉంచారు.

 

న్యాయపరంగా పోరాటం చేస్తాం(Dimple Hayathi)

ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో డింపుల్ అసహనానికి గురై ఆ కోన్స్‌ను కాలితో తన్నారు. ఆ ఘటన జరిగినపుడే డీసీపీపై కేసు పెడతానని డింపుల్‌ చెప్పారు. అందుకే రివర్స్ లో ఆమెపైనే కేసు పెట్టారు. డీసీపీ డింపుల్ ను వేధించాలనుకుంటున్నారు. తన క్వార్టర్స్‌లో డిసీపీ ఉండకుండా ఈ అపార్ట్‌మెంట్‌లో ఎందుకు ఉన్నారు? ఆయన ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారు. ఆయనపై ఫిర్యాదు చేయడానికి నిన్న డింపుల్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. కానీ ఎవరూ ఆమె కంప్లైంట్ ను తీసుకోలేదు. దాదాపు 3 గంటలపాటు అక్కడే కూర్చొబెట్టారు. మేము దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అని లాయర్ వివరించారు. అన్నారు.

 

ఫ్యాన్స్ కు డింపుల్ థ్యాంక్స్(Dimple Hayathi)

కాగా, ఇదే విషయంపై డింపుల్ కూడా రియాక్ట్ అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు సపోర్ట్ గా నిలుస్తున్న ఫ్యాన్స్ కు ఆమె థ్యాంక్స్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అండగా ఉన్న వారందరి ప్రేమకు కృతజ్ఞురాలినని డింపుల్ అన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు తానేమీ అధికారిక ప్రకటన చేయలేదని.. దయచేసి సహనంతో ఉండాలని కోరారు. తన లీగల్ టీమ్ త్వరలోనే బదులిస్తుందని ఆమె తెలిపారు.

 

జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని హుడా ఎన్‌క్లేవ్‌లో డీసీపీ రాహుల్‌ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో డింపుల్‌ హయాతి, డేవిడ్‌ కూడా నివసిస్తున్నారు. సెల్లార్‌లో ఉన్న పార్కింగ్‌ ప్లేస్‌లో హెగ్డే అధికారిక వాహనాన్ని నటి డింపుల్‌ హయాతి ధ్వంసం చేశారన.. డీసీపీ డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డింపుల్‌ హయాతి, డేవిడ్‌పై జూబ్లీహిల్స్‌ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 41 CRPC కింద పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. మరోవైపు దీనిపై డింపుల్‌ హయాతి jpce ట్వీట్‌ చేసింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తప్పును కప్పిపుచ్చుతున్నట్టు పరోక్షంగా డీసీపీని ఉద్దేశించి ట్వీట్ చేసింది.