Home / బిజినెస్
గత రెండు సంవత్సరాలుగా రోజువారీ నిత్యావసరాల ధరల పెరుగుతూనే ఉన్నాయి. అయతే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో, బిస్కెట్లు వంటి రోజువారీ వినియోగించే ప్యాకేజ్డ్ ఆహారం మళ్లీ సరసమైన ధరకు లభిస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 40కి పైగా ఐటీ బృందాలు 20 ప్రాంతాల్లో జరుగుతున్న తనిఖీల్లో పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.
భారతి ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ( డాట్ )కి రూ. 8,312.4 కోట్లు చెల్లించింది. షెడ్యూల్ కంటే ముందే 5G స్పెక్ట్రమ్ బకాయిలను సెటిల్ చేసిందని కంపెనీ బుధవారం తెలిపింది.
ఇప్పటికే పలు నిత్యావసరాల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్న ప్రజలను డెయిరీ కంపెనీలు కూడ బాదడం ప్రారంభించాయి. డెయిరీ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న అమూల్ మంగళవారం ప్యాక్డ్ మిల్క్‌పై లీటరు ధరను రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది.
భారతదేశం 2022 ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన "హర్ ఘర్ తిరంగ" పిలుపును దేశప్రజలు స్వీకరించారు. ఈ ఏడాది 30 కోట్లకు పైగా జాతీయ జెండాల విక్రయం ద్వారా దాదాపు రూ. 500 కోట్ల ఆదాయం సమకూరిందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బిపిసిఎల్ ) రాబోయే ఐదేళ్లలో పెట్రోకెమికల్స్, సిటీ గ్యాస్ మరియు క్లీన్ ఎనర్జీలో రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దేశంలోని 83,685 పెట్రోల్ పంపుల్లో 20,217ని కలిగి ఉన్న బిపిసిఎల్, కేవలం బంకుల్లో పెట్రోల్ మరియు డీజిల్‌ను విక్రయించడమే కాకుండా,
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ... రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఈ రోజు ఉదయం ఆగంతకుడు నాలుగు సార్లు ఫోన్ చేశాడు.
ఆహార ధరల్లో నియంత్రణ కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. జూన్‌లో 7.75 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జులైలో 6.75కి తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో, వినియోగదారుల ధరల సూచీ ( సీపీఐ ) ఆధారిత ద్రవ్యోల్బణం
ప్యాకేజ్డ్ ఫుడ్స్, బ్యూటీ, పర్సనల్ కేర్ మరియు క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్లు పెద్ద మెట్రోల కంటే చిన్న పట్టణాలు లేదా టైర్ 2 మరియు 3 మార్కెట్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంపెనీ నెస్లేచైర్మన్ సురేష్ నారాయణన్ తన రెండవ త్రైమాసిక ఆదాయానికి సంబంధించి క్లాస్ వన్ పట్టణాలు రెండంకెల వృద్ధిని సాధించామని తెలిపారు.
జాన్సన్ & జాన్సన్ తన ఐకానిక్ టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలను 2023తో ప్రపంచవ్యాప్తంగా ముగించనున్నట్లు ప్రకటించింది. వివిధ దేశాల్లో చట్టపరమైనసవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ బేబీ పౌడర్ ఉత్పత్తులను నిలిపివేయాలని నిర్ణయించింది.