Last Updated:

Johnson and Johnson: జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్ రద్దు..!

జాన్సన్ బేబీ పౌడర్లు, సబ్బులు, క్రీములు వాడకుండా పిల్లలు పెద్దయ్యి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆనాటి నుంచి ఇప్పుడే పుట్టిన నవజాత శిశివులకు వాడే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి జాన్సన్ అండ్ జాన్సన్ ప్రొడక్టులనే చెప్పవచ్చు. అయితే తాజాగా జాన్సన్ బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్సును మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

Johnson and Johnson: జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్ రద్దు..!

Johnson Baby Powder: జాన్సన్ బేబీ పౌడర్లు, సబ్బులు, క్రీములు వాడకుండా పిల్లలు పెద్దయ్యి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆనాటి నుంచి ఇప్పుడే పుట్టిన నవజాత శిశివులకు వాడే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి జాన్సన్ అండ్ జాన్సన్ ప్రొడక్టులనే చెప్పవచ్చు. అయితే తాజాగా జాన్సన్ బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్సును మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి చెందిన బేబీ పౌడ‌ర్ ఉత్ప‌త్తి లైసెన్సును మ‌హారాష్ట్ర ఫుడ్ అండ్ డ్ర‌గ్స్ అడ్మినిస్ట్రేష‌న్ ర‌ద్దు చేసింది. ప్ర‌జల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. జాన్స‌న్ బేబీ పౌడ‌ర్ వ‌ల్ల శిశువుల చ‌ర్మాల‌పై ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తున్న‌ట్లు తెలిపింది. పూణె, నాసిక్‌ల నుంచి పౌడ‌ర్ శ్యాంపిళ్ల‌ను సేక‌రించి మ‌హారాష్ట్ర‌లో ప‌రీక్ష‌లు చేశారు. ల్యాబ‌రేట‌రీ ప‌రీక్ష స‌మ‌యంలో పౌడ‌ర్ పీహెచ్ విలువ స్థిరంగా లేద‌ని ఎఫ్‌డీఏ వెల్లడించింది. కోల్‌క‌తాకు చెందిన సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు పేర్కొనింది.

ఇదీ చదవండి: 75 ఏళ్ల తరువాత భారత్ భూబాగంలో చిరుతలు.. వీటి కున్న ప్రాముఖ్యత ఏమిటి?

ఇవి కూడా చదవండి: