Mark Zuckerberg: 11వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన.. ప్రకటించిన మెటా
ఫేస్ బుక్ మాతృ సంస్ధ మెటా తన కంపెనీలో పనిచేస్తున్న 11వేల మంది ఉద్యోగుకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మెటా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.
Meta Company: ఫేస్ బుక్ మాతృ సంస్ధ మెటా తన కంపెనీలో పనిచేస్తున్న 11వేల మంది ఉద్యోగుకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మెటా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.
ఉద్యోగుల తొలగింపు అంశం, మెటా చరిత్రలో ఓ కఠినమైన రోజుగా ఆయన అభివర్ణించారు. కంపెనీలో పనిచేస్తున్న 87వేల ఉద్యోగుల్లో 13శాతం అంటే సుమారుగా 11వేల మందికి ఉద్వాసన పలుకనున్నట్లు చెప్పారు. కంపెనీ ఖర్చులు తగ్గించుకోవడంలో ఇందుకు ప్రధాన కారణమన్నారు. 2023 ఏప్రిల్ 1 వరకు ఎలాంటి నియమకాలు ఉండవన్నారు. ప్రకటనల ఆదాయం గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దీనికి బాధ్యత తనదేనని పేర్కొన్న జుకర్ బర్గ్ ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు.
ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా వివరాలు వస్తాయన్నారు. వారి కంప్యూటర్లకు అనుసంధానమైన యాక్సిస్ కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు. తొలగింపుకు గురైనా ఉద్యోగులకు 16వారాల జీతం, కంపెనీలో పనిచేసిన కాలానికి ఏడాదికి రెండు వారాల లెక్కన అదనపు జీతాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే తొలగింపు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు 6నెలల వరకు ఆరోగ్య బీమా కొనసాగుతుందని చీఫ్ జుకర్ బర్గ్ తెలిపారు.
ఇటీవల ట్విటర్ ను హస్తగతం చేసుకొన్న ఎలన్ మస్క్ కూడా భారీ స్థాయిలో ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఇదే క్రమంలో పలు కంపెనీలు ఆ బాటలో సాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Electric Bike deal: ఇ-కామర్స్ సంస్ధ అమెజాన్ డెలివరీలో విద్యుత్ వాహనాలు.. టివిఎస్ తో ఒప్పందం