Last Updated:

Google Pixel 7a: మే 11న భారత మార్కెట్ లోకి పిక్సెల్ 7ఏ

ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ తన సరికొత్త పిక్సెల్ 7 ఏ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. మే 11 న భారత్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది.

Google Pixel 7a: మే 11న భారత మార్కెట్ లోకి పిక్సెల్ 7ఏ

Google Pixel 7a: ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ తన సరికొత్త పిక్సెల్ 7 ఏ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. మే 11 న భారత్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో మే 11 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ కు సంబంధించిన ప్రత్యేకతలు ప్రస్తుతం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

 

పిక్సెల్ 7ఏ  ప్రత్యేకతలు(Google Pixel 7a)

పిక్సెల్ 7ఏ లో ఫేస్ అన్ లాక్ తో పాటు ఫింగర్ ప్రింట్ అన్ లాక్.. ఇలా బయోమెట్రిక్ ఆప్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్ కంటే ముందు వచ్చిన పిక్సెల్ 6ఏ లో ఫేస్ అన్ లాక్ సపోర్ట్ లేదు. కేవలం ఫింగర్ ప్రింట్ అన్ లాక్ మాత్రమే అందుబాటులో ఉంది. అదే విధంగా 6.1 ఇంచుల అమోల్డ్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్, టెన్సర్ జీ 2 ఎస్ఓసీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ను ఇది సపోర్టు చేస్తుంది. 8 జీబీ ర్యామ్ , 256 జీబీ ఇంటర్నర్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, వెనుక వైపు 64 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 787 ప్రైమరీ సెన్సార్ తో పాటు 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఇచ్చారు. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నారు. దీని ధర రూ. 35 వేల నుంచి 39 వేల మధ్యలో ఉండనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

తగ్గిన పిక్సెల్ 7 సిరీస్ ధరలు

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో ధరలను తగ్గించింది. సేల్ ప్రారంభం అయ్యాక పిక్సెల్ 7 పై మరిన్ని డిస్కౌంట్స్ ఉండనున్నాయి. గత ఏడాది అక్టోబర్ లో వచ్చిన ఈ ఫోన్లలో ప్రత్యేకమైన టెన్సర్ జీ2 ప్రాసెసర్ ఉంటుంది. 30 Wat ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. వైర్ లెస్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.

ధరల్ని తగ్గించిన తర్వాత ప్రస్తుతం గూగుల్‌ పిక్సెల్‌ 7 ధర రూ. 49,999 గా ఉంది. పిక్సెల్‌ 7 ప్రో ధరను రూ. 69,999 గా నిర్ణయించారు. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్లు వరుసగా రూ. 59,999, రూ. 84,999 ధరలతో మార్కెట్‌లోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ సేల్‌ లో ఆఫర్స్ ను బట్టి చూస్తే మరో రూ. 5 వేలు వరకు తగ్గే అవకావం ఉంది.

 

ఇవి కూడా చదవండి: