Pawan Kalyan: కొణిదేలకు పవన్ కళ్యాణ్ రూ.50లక్షల విరాళం

Pawan Kalyan: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఎన్నికల ముందు కొణిదేల గ్రామంలో పర్యటించిన పవన్.. తన ఇంటిపేరుతో ఊరు ఉందన్న విషయం తనకు తెలియదన్నారు. తాము అధికారంలోకి వస్తే కొణిదేల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
మొదటిసారి గ్రామంలో నీటి కొరత ఉందని స్థానిక ఎమ్మెల్యే జయసూర్య.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన పవన్.. వాటర్ ట్యాంక్ నిర్మాణానికి తన ట్రస్టు ద్వారా 50 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీంతో ఇవాళ కొణిదేల గ్రామంలో ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.