Published On:

Siddarth Kaushal: ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా

Siddarth Kaushal: ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా

IPS Officer Resigned: ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను డీజీపీకి పంపినట్టు చెప్పారు. అయితే ఆయనకు సర్వీస్ ఉండగానే రాజీనామా చేయడం గమనార్హం. తన రాజీనామాకు పూర్తిగా వ్యక్తిగత కారణాలేనని స్పష్టం చేశారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, ఎలాంటి ఒత్తిడి తనపై లేదని చెప్పారు. అయితే తనపై కొన్ని కథనాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని తెలిపారు.

 

ఇప్పటివరకు తాను నిర్వహించిన విధుల్లో సహకరించిన ప్రభుత్వానికి, సహచరులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఐఐఎం విద్యార్థినని.. ఈ నేపథ్యంలోనే తనకు మంచి ఆఫర్ రావడంతో ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినట్టుగా సిద్ధార్థ్ కౌశల్ వివరణ ఇచ్చారు. తన కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తన సొంత రాష్ట్రంగా అనుకుంటానని తెలిపారు. భవిష్యత్తులో కూడా సమాజానికి సేవ చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

 

కాగా సిద్ధార్థ్ కౌశల్ ప్రస్తుతం ఏపీ డీజీపీ ఆఫీస్ లో ఏస్పీ (అడ్మిన్) గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్) కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగా కొద్దిరోజులుగా ఆయన విధులకు దూరంగా ఉంటున్నారు. గతంలో కృష్ణా, ప్రకాశం, కడప జిల్లా ఎస్పీగా పనిచేశారు. కాగా ఐపీఎస్ సిద్ధార్థ్ రాజీనామా ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి: