Last Updated:

Airbus Beluga: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ ‘తిమింగలం..’!

హైదరాబాద్ లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ‘తిమింగలం’వాలింది. ఒకరోజంతా అక్కడే సేదతీరి.. తిరిగి సోమవారం రాత్రి ఎగిరిపోయింది. సముద్రంలో ఉండాల్సిన తిమింగలం ఎయిర్‌పోర్టులో ఉండడమేంటా అనే కదా మీ సందేహం నిజమేనండి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమాన తిమింగలం.

Airbus Beluga: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ ‘తిమింగలం..’!

Airbus Beluga: హైదరాబాద్ లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ‘తిమింగలం’ వాలింది. ఒకరోజంతా ఇక్కడే ఉండి తిరిగి సోమవారం రాత్రి ఎగిరిపోయింది. సముద్రంలో ఉండాల్సిన తిమింగలం ఎయిర్‌పోర్టులో ఉండడమేంటా అనే కదా మీ సందేహం నిజమేనండి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమాన తిమింగలం. దీనిపేరు ఎయిర్‌ బస్‌ బెలూగా. దుబాయ్‌లోని అల్‌ మక్‌తుమ్‌ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని పట్టాయా ఎయిర్‌పోర్టుకు వెళ్తూ మార్గం మధ్యలో ఇంధనం నింపుకునేందుకు ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని శంషాబాద్‌లో ల్యాండ్‌ అయింది. కాగా, విమాన ల్యాండింగ్‌, పార్కింగ్‌, టేకాఫ్‌ కోసం విమానాశ్రయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సరకు రవాణాకోసం ప్రపంచంలో అతిపెద్ద విమానం ఆంటోనోవ్ ఏఎన్‌ 225 శంషాబాద్ విమానాశ్రయానికి 2016లో వచ్చిందని కాగా ఇప్పుడు తాజాగా రెండో అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలూగా ల్యాండైందని ఆర్‌జీఐఏ పేర్కొనింది. గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా ఆంటోనోవ్‌ ఏఎన్‌-225 మ్రియాకు పేరుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భాగంగా ఆ విమానాన్ని ఇటీవలే రష్యా ధ్వంసం చేసింది. దీంతో బెలూగా అతిపెద్ద కార్గో విమానంగా ఖ్యాతిలోకి వచ్చింది.

బెలూగా ప్రత్యేకతలు ఇవే..

  • ఎయిర్‌ బస్‌ కంపెనీ సరకు రవాణా కోసం ఇలాంటి ఐదు విమానాలను తయారు చేసింది. అందులో ఇదొకటి.
  •  దీన్ని ప్రత్యేకంగా విమానాల విడిభాగాల రవాణాతోపాటు అతిభారీ యంత్రాల రవాణాకు వినియోగిస్తున్నారు.
  • సాధారణంగా అన్ని విమానాల్లో వెనుక వైపు నుంచి లోడింగ్, అన్‌లోడింగ్‌ సదుపాయం ఉంటుంది. దీనికి మాత్రం ముందు నుంచి లోడింగ్‌ చేసే వీలుంది. లోడింగ్‌ సమయంలో ముందు భాగం పూర్తిగా పైకి లేస్తుంది.
  • దీని పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, బరువు మోసుకెళ్లే సామర్థ్యం 47వేల కేజీలు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ ఇళ్లల్లో ఐటీ సోదాలు

ఇవి కూడా చదవండి: