Donald Tarump: డోనాల్డ్ ట్రంప్‌నకు అరుదైన అవార్డు
Donald Trump receives ‘Patriot of the Year’ award: అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌నకు అరుదైన అవార్డు వరించింది. మీడియా సంస్థ ఫ్యాక్స్ నేషన్ నిర్వహించిన లాంగ్ ఐలాండ్ సమావేశంలో ‘పేట్రియాట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును డోనాల్డ్ ట్రంప్ అందుకున్నారు. వాస్తవానికి ఈ అవార్డును సైనికులు లేదా దేశానికి సేవ చేసే వారికి ఈ అవార్డును అందజేస్తారు. అయితే తొలిసారి ఈ అవార్డును ట్రంప్‌నకు అందజేయడం విశేషం.
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గత నాలుగేళ్లుగా చేయలేని పనులు తాను గత రెండు వారాల్లోనే చేసినట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ చెప్పారు. ఆ ఫలితాలను అమెరికన్లు అనుభవిస్తున్నారన్నారు. ఎన్నికలు జరిగే వరకు దాదాపు 72 రోజులు సెలవు లేకుండా పనిచేసినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సమీప అభ్యర్ధి కమలాహారిస్‌పై విజయం సాధించినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అభివృద్ధి విషయంపై పలుమార్లు ప్రస్తావించారు. ఒకవేళ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రస్తుతం దేశంలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని ప్రకటించారు. అలాగే నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు అమెరికా కంపెనీలను మళ్లీ వెనక్కి తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న కార్మికుల జీతాలను పెంచేలా చర్యలు చేపడతానని పేర్కొన్నారు.