Australia vs India: టాస్ గెలిచిన భారత్.. 25 పరుగులకే 4 వికెట్లు
Australia vs India Border- Gavaskar Trophy first match: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్, గావస్కర్ ట్రోఫీ జరుగుతోంది. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే పెద్ద షాక్ తగిలింది. ఆసీస్ బౌలింగ్‌కు భారత బ్యాటర్లు బెంబేలెత్తారు. టాప్ ఆర్డర్ కనీసం బాల్ టచ్ చేసేందుకు సైతం సాహసం చేయలేకపోయింది. దీంతో తొలి సెషన్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ నిలకడగా ఆడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 23 బంతులను ఎదుర్కొని క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ కూడా 5 పరుగులకే వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 26 పరుగులతో రాణిస్తుండగా.. స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రిషభ్ పంత్(10), ధ్రువ్ జురెల్(4) పరుగులతో క్రీజులో ఉన్నారు. లంచ్ సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవ్ దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషభ పంత్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, బుమ్రా
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్ స్వీనీ, లుబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, నాథన్ లియన్, హేజిల్‌వుడ్.