RRR: ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమా రికార్డ్స్ నెలకొల్పుతూ, జపాన్ లో కూడా మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. నాటు నాటు పాట తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ ని చిందులేయించిన పాట. ఇప్పుడు ఈ పాటకి అంతర్జాతీయ అవార్డు ( గోల్డెన్ గ్లోబ్ ) రావడంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాని ఊపేస్తున్నారు.
హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, చిత్ర దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కి ప్రముఖుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం వైయస్ జగన్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బండి సంజయ్, మెగా స్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మమ్ముట్టి, సమంత వంటి సినీ రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ఆర్ఆర్ఆర్(RRR) టీంపై ప్రశంశలు కురింపించారు.
థాంక్యూ మామయ్య..
కాగా ఈ ప్రశంసలకి స్పందించిన హీరో రామ్ చరణ్ నరేంద్రమోదీకి ధన్యవాదాలు చెప్పగా, మరో హీరో ఎన్టీఆర్ ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైయస్ జగన్, చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. దీనిలో హైలైట్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి రిప్లై ఇస్తూ థాంక్యూ మామయ్య అని సంబోధించడం ఇటు తెలుగుదేశం శ్రేణుల్లోనూ, అటు నందమూరి అభిమానుల్లోనూ నూతనోత్సాహం వెల్లివిరిసింది.
ఈ అవార్డు అందుకోడానికి స్వయంగా ఆర్ఆర్ఆర్(RRR) టీం మొత్తం లాస్ ఏంజెల్స్ వెళ్ళింది.
అవార్డు అందుకున్న కీరవాణి మాట్లాడుతూ ఈ ఆనందాన్ని తన భార్యతో కలిసి పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ అవార్డు నిజానికి తన ఒక్కడిది కాదని రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ అని కూడా చెప్పారు.
నిజానికి ఈ అవార్డ్ గీత రచయిత చంద్ర బోస్, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ లకు దక్కాలని ఆయన అన్నారు. ఇక గోల్డెన్ గ్లోబ్ వేదికపై ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు
ఇవి కూడా చదవండి
Ram Charan: రామ్‌చరణ్ మెగా రివీల్: నెక్ట్స్ మార్వెల్ హీరో.. ఐరన్ మ్యాన్ vs కెప్టెన్ అమెరికా.. నేను నటించే సూపర్ హీరో క్యారెక్టర్ ఏంటంటే..
Ram Charan: రామ్‌చరణ్ గోల్డెన్ గ్లోబ్ ఇంటర్వ్యూ: ఏం యాక్సెంట్‌రా బాబూ.. మెగా పవర్‌స్టార్ అదరగొట్టేశాడు..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/