Home / తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11,12 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు సహా పలువురు ఉద్యమకారులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే మోదీ గో బ్యాక్ అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు పిలుపునిచ్చారు
దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ తెలంగాణలోని జహీరాబాద్‌లో ప్రారంభమయిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న శ్వేత విప్లవానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ యూనిట్ లో ప్రసిద్ధి గాంచిన అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జహీరాబాద్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో తెలిపారు.
హైదరాబాద్ లో ఈనెల 19, 20వ తేదీల్లో మరియు వచ్చేనెల 10,11వ తేదీల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా-ఈ రేస్ పోటీలకు హుస్సేన్‌సాగర్ వేదిక కానుంది.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాను కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేసారు. గురువారం తన అభిమానులతో వాజేడులో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీంతో తుమ్మల పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపామని కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేశారంటూ నమోదైన కేసులో అరెస్టైనముగ్గురు నిందితులను సిట్ బృందం విచారిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, కరీంనగర్, రామగుండంలో 'మోదీ నో ఎంట్రీ' అంటూ వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.NewsTelanganaHyderabadP
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం చదివిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. యూనివర్శిటీ బిల్లులను ఆపే హక్కు గవర్నర్ కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్ గురువారం ప్రమాణస్వీకారం చేసారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ప్రమాణం చేయించారు.