Last Updated:

Vodafone Idea 5G: వోడాఫోన్ ఐడియా 5జీ నెట్‌వర్క్ పై కొత్త అప్డేట్

వోడాఫోన్ ఐడియా ఎట్టకేలకు 5జీ నెట్‌వర్క్ లాంచ్ చేయనుంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ విషయంలో ఇప్పటికే సంతేకాలు ఇవ్వగా, కానీ ఇంకా ఏ క్లారిటీ కూడా రాలేదు. కానీ వొడాఫోన్ ఐడియా ఈ విషయం పై స్పదించింది.

Vodafone Idea 5G: వోడాఫోన్ ఐడియా 5జీ నెట్‌వర్క్ పై కొత్త అప్డేట్

Vodafone Idea 5G: వోడాఫోన్ ఐడియా ఎట్టకేలకు 5జీ నెట్‌వర్క్ లాంచ్ చేయనుంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ విషయంలో ఇప్పటికే సంతేకాలు ఇవ్వగా, కానీ ఇంకా ఏ క్లారిటీ కూడా రాలేదు. కానీ వొడాఫోన్ ఐడియా ఈ విషయం పై స్పదించింది. 5జీని అతిత్వరలో లాంచ్ చేయనున్నట్టు కొత్త అప్డేట్ వచ్చింది. ఇందుకు సంబంధించి యూజర్లకు సందేశాలను కూడా పంపడం స్టార్ట్ చేసింది. ఢిల్లీలోని చాలా మంది సబ్‌స్క్రైబర్లకు 5జీ సర్వీస్‌ల సందేశాలను సెండ్ చేసింది.

ముందుగా దేశరాజధాని ఢిల్లీలో 5జీ నెట్‌వర్క్‌ను వొడాఫోన్ ఐడియా లాంచ్ చేయనున్నట్లు తెలిసిన సమాచారం. ఈ మేరకు ఆ ప్రాంతంలోని కొందరు కస్టమర్లకు వొడాఫోన్ ఐడియా ఇప్పటికే మెసేజ్‌లు పంపుతోంది. అతి త్వరలో మన ముందు 5జీ నెట్‌వర్క్ స్పీడ్‌ను ఎక్స్‌పీరియన్స్ చేస్తారంటూ ఆ ఎస్ఎంఎస్‌ల్లో ఉంది. “గుడ్‌న్యూస్! Vi నెట్‌వర్క్ కొత్త శుభ వార్తను మీ ముందుకు తీసుకొచ్చింది. 5జీకి అప్‍గ్రేడ్ అవుతోంది. మీ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్ అత్యుత్తమంగా ఉండబోతుంది. మా Vi నెట్‌వర్క్‌తో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అతిత్వరలో మంచి కవరేజ్‌‌ను, సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీస్‌లను పొందుతారంటూ ” ఢిల్లీలోని కొందరు వోడాఫోన్ ఐడియా యూజర్లకు సందేశాలను పంపింది.

5జీ రోల్అవుట్ గురించి ఢిల్లీలోని కొందరు యూజర్లకు సందేశాలు పంపినా, తేదీని మాత్రం వొడాఫోన్ ఐడియా ఇంకా బయటికి చెప్పలేదు. అయితే అక్టోబర్‌లో లంచ్ అవుతుందని తెలిసిన సమాచారం. 29న జరిగే ఏజీఎంలో కీలక ప్రకటనలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈనెలలో 5జీని లాంచ్ చేస్తామని ఎయిర్‌టెల్‌ అధికారికంగానే ప్రకటించింది. అయితే ఏ తేదీ అన్నది మాత్రం ఇంకా చెప్పలేదు. మరి ఎప్పుడు రోల్అవుట్ చేస్తుందో చూడాలి. ముందుగా దేశంలో 5జీ నెట్‌వర్క్ 13 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిసిన సమాచారం.

ఇవి కూడా చదవండి: