Last Updated:

Realme GT 7 Pro: రియల్‌మి సరికొత్త ఫోన్.. ఖతర్నాక్‌గా ఫీచర్లు.. లాంచ్‌కు ముందే హైప్ పీక్స్!

Realme GT 7 Pro: రియల్‌మి సరికొత్త ఫోన్.. ఖతర్నాక్‌గా ఫీచర్లు.. లాంచ్‌కు ముందే హైప్ పీక్స్!

Realme GT 7 Pro: స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి GT 7 Pro ని విడుదల చేయనుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అనేక ప్రీమియం ఫీచర్లో నవంబర్ 4న మార్కెట్‌లోకి రానుంది. ఈ ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయో టెక్ మేకర్ ఇప్పటికే వెల్లడించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, సామ్‌సంగ్ ఈకో ఓఎల్‌ఈడీ ప్లస్ డిస్‌ప్లే ఇందులో చూడొచ్చు. ఈ రియల్‌మి ఫోన్ ఒకేసారి చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర CNY 3,999 అంటే సుమారు రూ. 47,100 వద్ద లాంచ్ చేయచ్చు. ఈ ఫోన్ 12GB RAM+ 256GB స్టోరేజ్‌తో చైనీస్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. భారతదేశంలో ఈ ఫోన్ ఇతర స్టోరేజ్ ఆప్షన్స్‌లో కూడా రావచ్చు. Realme GT 6 Pro మాదిరిగానే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కూడా AI ఫీచర్లతో లోడై ఉంటుంది. ఇది Android 15 ఆధారంగా Realme UI 6.0లో రన్ అవుతుంది.

ఈ ఫోన్ గురించి గతంలో లీక్ అయిన ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఈ ఫోన్  అనేక వివరాలను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. రియల్‌మి ఈ ఫోన్ అల్యూమినియం మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఇది ఫోన్ తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా పని చేయడానికి వీలు కల్పిస్తుంది. ఒక చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్ దాని వెనుక ప్యానెల్‌లో చూడొచ్చు. దీనిలో మూడు కెమెరాలు అందించారు.

Realme GT 7 Pro కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే అదే కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. అయితే కొత్త మోడల్‌లో కెమెరా మాడ్యూల్‌ను స్క్వేర్ షేప్‌లో అమర్చారు. దాని వైపున హైపర్‌మేజ్+ బ్రాండింగ్ చూడొచ్చు. ఇది ఫోన్‌లో AI ఫీచర్‌ను సూచిస్తుంది. ఈ ఫోన్‌లో 8T LTPO ఎకో OLED ప్లస్ క్వాడ్ మైక్రో కర్వ్డ్ డిస్‌ప్లే ఇవ్వచ్చు. ఇటువంటి ఫీచర్లతో వస్తున్న మొదటి ఫోన్ ఇదే. ఫోన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. 16GB RAM+  512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది.