Flipkart Mobiles Bonanza Sale 2025: ఏప్రిల్ ఫూల్ కాదు.. ఫుల్ సేల్ ఇది.. ఖరీదైన ఫోన్లపై బంపర్ ఆఫర్

Flipkart Mobiles Bonanza Sale 2025: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో డిస్కౌంట్‌తో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి మంచి అవకాశం ఉంది. ధర తగ్గింపులతో పాటు, ఇతర ఆఫర్ల సహాయంతో మీరు మీ బడ్జెట్ ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. ఏప్రిల్ 14న ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ ఏప్రిల్ 20, 2025 వరకు కొనసాగుతుంది. మీరు భారీ డిస్కౌంట్‌లతో కొత్త, ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.
మొబైల్ బొనాంజా సేల్ సందర్భంగా.. పోకో, ఇన్ఫినిక్స్ నుండి ఇటీవల విడుదల చేసిన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. వాటి ధర ఇప్పటికే చాలా తక్కువగా ఉంది.మొబైల్స్ బొనాంజా సేల్‌లో ఈ ఫోన్‌లు మీకు మరింత చౌకగా ఉంటాయి. ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్,పోకో C71 లపై లభించే డిస్కౌంట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Infinix Note 50X 5G Offers
ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్ సందర్భంగా ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్ భారీ తగ్గింపుతో అమ్ముడవుతోంది. మీరు వివిధ ఆఫర్ల ద్వారా దాని ధరపై తగ్గింపు పొందవచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్ ధర రూ. 15,000 కానీ డిస్కౌంట్ తర్వాత దాదాపు రూ. 3500 తగ్గుతుంది. అయితే, బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ తర్వాత ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్ మరింత చౌకగా ఉంటుంది.
మొబైల్ బొనాంజా సేల్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్ ధర రూ. 14,999. 23 శాతం తగ్గింపుతో అమ్ముడవుతోంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి రూ.11,499కి కొనుగోలు చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై మీరు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందచ్చు. ఇతర ప్రత్యేక ఆఫర్ల నుండి క్యాష్‌బ్యాక్ లేదా కూపన్ ప్రయోజనాలను కూడా పొందచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.10,300 వరకు తగ్గింపు లభిస్తుంది.
Poco C71 Offers
Poco C71 అనేది రూ. 10 వేల బడ్జెట్‌లో వస్తున్న స్మార్ట్‌ఫోన్. ఇటీవలే Poco C71 ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. మీరు దానిని అసలు ధర కంటే చాలా తక్కువకు కొనుగోలు చేయచ్చు. దీని ధరపై రూ.2500 వరకు తగ్గింపు ఇస్తున్నారు. Poco C71 ధర రూ. 9,999, కానీ ధర తగ్గింపు ద్వారా ఇది కేవలం రూ. 7,499కే లభిస్తుంది.
పోకో C71 టాప్ వెర్షన్ 6 జీబీ ర్యామ్,128 జీవీ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.7,499. బ్యాంక్ ఆఫర్ కింద, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు పాత ఫోన్‌ను మార్చుకోవాల్సి ఉంటే, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ద్వారా రూ.5,950 వరకు తగ్గింపు పొందచ్చు.