Last Updated:

BSNL: BSNL షాకింగ్ డెసిషన్.. రేపటి నుంచి ఆ ఫోన్లలో సిమ్ పనిచేయదు..!

BSNL: BSNL షాకింగ్ డెసిషన్.. రేపటి నుంచి ఆ ఫోన్లలో సిమ్ పనిచేయదు..!

BSNL: బీఎస్ఎన్ఎల్ రేపటి నుంచి అంటే జనవరి 15 నుంచి తన స్పెషల్ సర్వీస్‌ను నిలిపివేయబోతోంది. ప్రభుత్వ టెలికాం కంపెనీ 4జీ నెట్‌వర్క్ విస్తరణకు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇది లక్షలాది మంది బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ప్రభావితం చేయబోతోంది. ఈ సంవత్సరం జూన్‌లో ప్రభుత్వ టెలికాం కంపెనీ తన 4జీ సేవను పాన్ ఇండియా స్థాయిలో ప్రారంభించబోతోంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవను ప్రారంభించిన తర్వాత, దేశంలోని కోట్లాది మంది వినియోగదారులు మెరుగైన కనెక్టివిటీని పొందడం ప్రారంభిస్తారు.

బీహార్ టెలికాం సర్కిల్‌లో 3G సేవలను పూర్తిగా మూసివేయాలని BSNL నిర్ణయించింది. ఇందుకోసం రేపటి వరకు అంటే జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. బీహార్ రాజధాని పాట్నాతో పాటు అనేక జిల్లాల్లో 4G సర్వీస్ అప్‌గ్రేడ్‌ను BSNL పూర్తి చేసింది. మోతిహారి, కతిహార్, ఖగారియా, ముంగేర్‌లలో కంపెనీ మొదటి దశలో 3G సేవలను నిలిపివేసింది. ఇప్పుడు పాట్నా, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో 3G సేవ నిలిపివేయనుంది.

ఇది 3G SIM కార్డ్‌లను కలిగి ఉన్న వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. సర్వీస్ నిలిపివేసిన తర్వాత డేటాను ఉపయోగించడంలో ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. దీని కోసం వినియోగదారులు తమ సిమ్ కార్డును 4Gకి అప్‌గ్రేడ్ చేయాలి. BSNL తన వినియోగదారుల సిమ్ కార్డ్‌లను ఉచితంగా 4G/5Gకి అప్‌గ్రేడ్ చేస్తోంది. దీని కోసం, వినియోగదారులు సమీపంలోని టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ లేదా బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి. అవసరమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత 4G SIM కార్డ్ అందుబాటులో ఉంటుంది.

బీహార్‌తో పాటు, దేశంలోని ఇతర టెలికాం సర్కిల్‌లలో BSNL 3G సేవలను దశలవారీగా నిలిపివేస్తోంది. దీనికి బదులుగా, 4G నెట్‌వర్క్‌ని అందుబాటులోకి తీసుకొస్తుంది. BSN 4G సర్వీస్ ప్రారంభించిన తర్వాత, వినియోగదారులు 2G/3Gతో పోలిస్తే మెరుగైన కనెక్టివిటీ, ఇంటర్నెట్ వేగాన్ని ఆస్వాదించొచ్చు. గత ఏడాది జూలైలో ప్రైవేట్ కంపెనీల ప్లాన్‌లు ఖరీదైనవి కావడంతో లక్షల మంది వినియోగదారులు తమ నంబర్‌లను BSNLకి పోర్ట్ చేశారు. ప్రభుత్వ టెలికాం కంపెనీ నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ అయిన తర్వాత, వినియోగదారులు మెరుగైన కనెక్టివిటీని పొందడం ప్రారంభిస్తారు, ఇది ప్రైవేట్ టెలికాం కంపెనీలను కూడా ప్రభావితం చేస్తుంది. ఖరీదైన ప్లాన్‌ల కారణంగా, వినియోగదారులు BSNLకి మారవచ్చు.