Home / World Environment Day
World Environment Day: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు మొక్కలు నాటారు. ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సీఎం, డిప్యూటీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ, అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. […]
Aravali Green Wall Project: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దక్షిణ ఢిల్లీలోని ఆరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ రీలాంచ్ చేశారు. అందులో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మోదీ మర్రిచెట్టును నాటారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో పచ్చదనం వెల్లివిరిసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో చెట్లను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని […]
Vanamahotsavam At Amaravati: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనేపథ్యంలోనే రాజధాని అమరావతి ప్రాంతంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించనుంది. అనంతవరంలో జరగనున్న ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం అక్కడ మొక్కలు నాటనున్నారు. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా రాజధాని అమరావతి ప్రాంతంలో […]